E-Paper
Advertisement

Varanasi: రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. 2027 ని బాగానే టార్గెట్ చేశాడు

Varanasi: రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. 2027 ని బాగానే టార్గెట్ చేశాడు
Advertisement

SS Rajamouli Varanasi Movie: ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని ఏకైక డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. జక్కన్న తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. కేవలం సినిమా సినిమాకి సక్సెస్ కొట్టడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

2027 టార్గెట్ 

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో చివరిగా వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చూపించింది. నాటు నాటు పాట ఆస్కార్ వరకు వెళ్ళింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాను 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు ఎం ఎం కీరవాణి నిన్న స్పీచ్ లో చెప్పారు. అయితే 2027 సమ్మర్ అని అనగానే చాలామంది రిలీజ్ డేట్ వచ్చేసింది కదా అని ఆనందపడిపోయారు.

సమ్మర్ లోనే ఎందుకంటే

అయితే ఇక్కడ ఇంకా ఆనందపడాల్సిన విషయం ఇంకోటి ఉంది.ఏప్రిల్ 7 2027లో శ్రీరామనవమి పండుగ ఉంది. అందుకోసమే సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడు వేషంలో కనిపిస్తారు అని కూడా క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. అనుకున్న విధంగా అదే డేట్ కు ఈ సినిమా వచ్చింది అంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ మళ్లీ మనం చూడొచ్చు. ఈ సినిమా దాదాపు 3 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చూస్తుంటే అది నిజమయ్యే అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది. శ్రీరామనవమి పండగ కూడా కలిసి వస్తుంది కాబట్టి అప్పటి సినిమా రిలీజ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని పూర్తి చేయాలి.

Advertisement

Also Read: Akhanda 2 : ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ , పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్, బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా

రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

రాజమౌళి ప్లానింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి అంటే దానికి కారణం తను తీసుకున్న జాగ్రత్తలు. నిన్న జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ కూడా భారీ కాస్ట్ పెట్టి జియో హాట్స్టార్ రైట్స్ కొనుక్కుంది. ఒక విధంగా సినిమా ప్రమోషన్ అవ్వడంతో పాటు లాభాలు కూడా అక్కడ కొంతమేరకు వచ్చేసాయి.అయితే రాజమౌళి సినిమాలు చాలా సందర్భాల్లో చెప్పిన టైంకి రావు. ఎంతో కొంత టైం తీసుకుంటూనే ఉంటారు. మరి ఈ సినిమా విషయంలో అలా జరక్కుండా ఉంటే మంచి పరిణామం అని చెప్పాలి. మళ్లీ పోస్ట్ పోన్ అయింది అంటే ఒక మంచి రిలీజ్ డేట్ ను మిస్ చేసుకున్నట్లే అని చెప్పొచ్చు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×