E-Paper
Advertisement

Film Awards: రిలీజ్ కానీ సినిమాకు 3 అవార్డులు.. గవర్నమెంట్‌పై ట్రోలింగ్!

Film Awards: రిలీజ్ కానీ సినిమాకు 3 అవార్డులు.. గవర్నమెంట్‌పై ట్రోలింగ్!
Advertisement

Film Awards: తమిళనాడు ప్రభుత్వం తాజాగా రాష్ట్ర చలనచిత్ర అవార్డుల (Tamil Nadu State Film Awards) జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో కోలీవుడ్ (Kollywood) వర్గాల్లో కొత్త ఉత్సాహాం వచ్చింది. 2016 నుంచి 2022 వరకు విజేతలను ఒకేసారి వెల్లడించడంతో అటు వెండితెర దిగ్గజాలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, అవార్డులు పొందిన వారు, వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే, ఈ అవార్డులలో అవకతవకలు జరిగాయని తెలిపేలా ఓ మూవీ ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది. అసలు సినిమానే రిలీజ్ కాకుండా.. ఆ సినిమాకు 3 అవార్డులను ప్రభుత్వం ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యంతో పాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవార్డులలో కొన్ని జాబితాలకు మనీ పవర్ పని చేసిందనేలా కామెంట్స్ మొదలయ్యాయి. ఇంతకీ రిలీజ్ కాకుండానే అవార్డులు పొందిన చిత్రం ఏంటని అనుకుంటున్నారా? ఆ విషయానికి వస్తే..

Also Read- Actor Pawan: లైవ్‌లో నటికి ప్రపోజ్ చేసిన నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్! జరిగింది ఇదే!

రిలీజ్ కాని సినిమాకు మూడు అవార్డులు

Advertisement

తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ‘సందక్కారి’ (Sandakari Movie) అనే చిత్రానికి మూడు అవార్డులు వచ్చాయి. అసలు ఈ సినిమా ఎక్కడా రిలీజ్ కాలేదు. కనీసం ఓటీటీలో అయినా ఉందా? అంటే అదీ లేదు. మరి ఎలా అవార్డులు ఇచ్చారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశ్నల వర్షం కురుస్తుంటే.. నెటిజన్లు ప్రభుత్వాన్ని ఇదే విషయంపై భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో శ్రియా శరణ్ (Shriya Saran) హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న శ్రియ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, విమల్ (Vimal) హీరోగా నటించారు. అప్పట్లో ఆర్థిక సమస్యల కారణంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో ఈ సినిమాకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అంతే, అసలు రిలీజ్ కాని సినిమాకు ఎలా అవార్డులు ఇస్తారంటూ ఫిల్మ్ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ సంవత్సరం చాలా గొప్ప సినిమాలు ఉంటే, వాటిని కాదని, రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు ఇస్తారా? అని ఫైర్ అవుతున్నారు.

Also Read- Actress Revathi: ఆకతాయి అసభ్యకరంగా తాకినందుకు నటి రేవతి ఏం చేసిందంటే?

ట్విస్ట్ ఏంటంటే..

Advertisement

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్.. అదేంటంటే ఇది తమిళ స్ట్రయిట్ సినిమా కూడా కాదంట. మలయాళ భాషకు చెందిన ‘మై బాస్’ అనే చిత్రానికి రీమేక్‌గా ‘సందక్కారి’ చిత్రాన్ని రూపొందించారట. మలయాళం వాళ్లు.. ఈ సినిమా హాలీవుడ్ నుంచి స్పూర్తి పొంది తీశారట. మరి అలాంటి సినిమాకు మూడు అవార్డులు ఇవ్వడం అంటే, కచ్చితంగా అనుమానాలకు తావిచ్చినట్లే. ఈ అవార్డుల ఎంపికలో ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? అవార్డుల జ్యూరీ కమిటీ ఎలా దీనిని సమర్థించుకుంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ‘సందక్కారి’ విషయానికి వస్తే.. సీనియర్ నటుడు ప్రభు ఓ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఆర్ మాదేశ్ దర్శకుడు. ఈ సినిమాను అప్పట్లో తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూశారట. అదన్నమాట అసలు మ్యాటర్.

Also Read- Varanasi: మహేష్ బాబు కోసం ఎప్పుడు చేయని పనికి మొదటిసారి ఒప్పుకున్న రాజమౌళి..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×