Ramayana Telugu Pre Release: బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ (Ramayana). ఇదివరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నితీష్ తివారి సైతం మరోసారి రామాయణ(Ramayana) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
రామాయణ సినిమా మొదటి భాగం దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ ఎంతో ఘనంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగులో ప్రీ రిలీజ్ (Telugu Pre Release) వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జెఆర్ సీ కన్వెన్షన్, హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరగబోతుందని చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొనబోతున్నారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరు అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) సందడి చేయబోతున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.
మరి నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ (Yash) నటించబోతున్న సంగతి తెలిసిందే.సన్నీ డియోల్ హనుమంతుడు, రవి దూబే లక్ష్మణుడు, అమితాబ్ బచ్చన్ జటాయు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల టాక్సిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిరాశ ఎదుర్కొన్న నటుడు యష్ రామాయణ సినిమా పైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో ఈయన నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: నా కోరిక నెరవేరలేదు.. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్స్!