E-Paper
Advertisement

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా
Advertisement

Crime Comedy Series OTT : జీవితంలో ఎన్నో మోసాలు చేసి పోలీసులకే చిక్కకుండా తప్పించుకున్న ఓ మోసగాడు… ఇప్పుడు తన తెలివితేటలతో ప్రపంచంలోనే అత్యంత విలువైన పురాతన నిధిని సొంతం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తారు. పాత గ్యాంగ్‌ ను మళ్లీ రంగంలోకి దించి, నిధి కోసం వేట మొదలు పెడతారు. కానీ ఆ సంపద కోసం ఎదురు చూస్తున్నది అతడొక్కడే కాదని తెలిస్తే, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే ఈ పోరులో అసలు విజేత ఎవరు ? నిధి వేటను క్రైమ్‌, కామెడీతో కలిపి చూపించే టర్కిష్‌ సిరీస్‌ ‘మనీ ట్రాప్‌ ది కరున్‌ ట్రెజర్‌’ (Money Trap The Karun Treasure). మరి ఈ సిరీస్‌ తెలుగులో అందుబాటులో ఉందా ? ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

అసిమ్‌ నోయాన్‌ ఓ ట్యాలెంటెడ్ మోసగాడు. తన తెలివితేటలతో ఎన్నో సందర్భాల్లో ఇతరులను బురిడీ కొట్టించిన అతడు, ఇప్పుడు నేర ప్రపంచం నుంచి బయటపడాలని భావిస్తాడు. ఇక చివరిసారిగా ఓ పెద్ద పని చేసి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్న సమయంలో అతడి చేతికి ఓ రహస్యమైన నిధి మ్యాప్ చిక్కుతుంది. ఆ పటం కరున్‌ నిధి వైపు దారి చూపిస్తుందని తెలుసుకున్న అసిమ్‌, తన పాత గ్యాంగ్‌ ను మళ్లీ ఒకచోట చేర్చుకుంటాడు.

Advertisement

అసిమ్‌ బృందం నిధి కోసం అన్వేషణ మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రయాణం అనుకున్నంత సులభం కాదని తెలుస్తుంది. ఆ నిధిపై కన్నేసిన ప్రమాదకరమైన ప్రత్యర్థులు, అంతర్జాతీయంగా సంపద కోసం వెతికే వ్యక్తులు కూడా రంగంలోకి దిగుతారు. ఇస్తాంబుల్‌ వీధుల నుంచి భూగర్భ మార్గాల వరకు సాగిపోయే ఈ అన్వేషణలో ప్రతి అడుగు కొత్త సవాలుగా మారుతుంది.

మోసాలు చేయడంలో అసిమ్‌ బృందానికి అనుభవం ఉన్నా, ఈసారి ఎదురుగా ఉన్నవారు కూడా తక్కువేమీ కాదు. నిధి మ్యాప్ లోని సూచనలను అర్థం చేసుకోవడం, ప్రత్యర్థుల కదలికలను ముందే ఊహించడం, తమ ప్రణాళిక బయట పడకుండా చూసుకోవడం వంటి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఒక చిన్న పొరపాటు మొత్తం ప్రయత్నాన్ని దెబ్బతీయవచ్చు. ఈ క్రమంలో పాత గ్యాంగ్‌ సభ్యుల మధ్య ఏర్పడే గందరగోళం, ఒకరిపై మరొకరికి ఉండే అనుమానాలు కథలో కామెడీని క్రియేట్ చేస్తాయి.

Advertisement

అసలు నిధి నిజంగా ఎక్కడ ఉంది ? దాన్ని ముందుగా ఎవరు చేరుకుంటారు ? అసిమ్‌ తన చివరి మోసాన్ని విజయవంతంగా పూర్తి చేసి నేర ప్రపంచం నుంచి బయట పడగలడా ? లేక ఈ నిధి వేట అతడిని మరోసారి ప్రమాదంలోకి నెడుతుందా ? అనేవి సిరీస్‌ లోని ప్రధాన ఆసక్తికర అంశాలు.

Also Read : మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘మనీ ట్రాప్‌ ది కరున్‌ ట్రెజర్‌’ అక్టోబర్‌ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇది టర్కిష్‌ భాషలో రూపొందిన క్రైమ్‌ కామెడీ సిరీస్‌. యిల్మాజ్‌ ఎర్డోగన్‌ (Yılmaz Erdoğan), కివాంచ్‌ టాట్లిటుగ్‌ (Kıvanç Tatlıtuğ), డెమెట్‌ అక్బాగ్‌ (Demet Akbağ), ఎజ్గి మోలా (Ezgi Mola), ఉరాజ్‌ కైగిలారోగ్లు (Uraz Kaygılaroğlu) తదితరులు నటించారు. షెనోల్‌ సోన్మెజ్‌ (Şenol Sönmez) దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్‌ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Tags

Related News

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Big Stories

Advertisement
×