E-Paper
Advertisement

మళ్లీ వాయిదా పడిన పెద్ది..కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే..ఈసారైనా కన్ఫర్మ్ గా వస్తాడా?

మళ్లీ వాయిదా పడిన పెద్ది..కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే..ఈసారైనా కన్ఫర్మ్ గా వస్తాడా?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie)విషయంలో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది.

మళ్లీ పెద్ది వాయిదా.. నిరాశలో మెగా ఫాన్స్..

మార్చి 27వ తేదీ విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ కూడా రావడంలేదని మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ సినిమా జూన్ 26వ తేదీకి వాయిదా పడిందని తెలుస్తోంది. జూన్ 26వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా తెలియచేయబోతున్నారు. జూన్ 26న ఈ సినిమా విడుదల కాగా 25వ తేదీ ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. 26వ తేదీ మొహరం హాలిడే ,27 శనివారం, 28 ఆదివారం ఇలా వరుసగా సెలవులు రావడం సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి.

జూన్ నెలలో రాబోతున్న పెద్ది…

Advertisement

ఇక జూన్ 26వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఆ సమయానికి వేసవి సెలవులు పూర్తి అవుతాయి అలాగే వర్షాలు కూడా పడుతుంటాయి. ఇలా అధిక వర్షాల సమయంలో ఈ సినిమాని విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలా తరచూ ఈ సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకొని చాలాకాలం అయింది. ఈ నేపథ్యంలోనే పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో పహిల్వాన్ గ్లింప్స్ ..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ఒక వారంలో పూర్తి కానుంది అయితే ఎలాంటి హడావిడి లేకుండా మంచి క్వాలిటీతో సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా వాయిదా వేసుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా తరుచూ వాయిదా పడటంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు జగపతిబాబు, శివ రాజ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పహిల్వాన్ గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన ఆదరణ లభించడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

Also Read: మానసికంగా కృంగిపోయాను.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను: హేమ

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×