E-Paper
Advertisement

‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ వదిలిన హిట్ దర్శకుడు

‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ వదిలిన హిట్ దర్శకుడు
Advertisement

Ento Antha Sari Kothaga: ‘హిట్’ సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న దర్శకుడు శైలేష్‌ కొలను (Sailesh Kolanu). ఇప్పుడీ దర్శకుడు ఓ చిన్న సినిమాకు సపోర్ట్ అందించారు. రాము ప్రొడక్షన్స్ (Ramu Productions) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’ (Ento Antha Sari Kothaga). ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు శైలేష్‌ కొలను ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ బోను కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాము ప్రొడక్సన్స్‌పై రాము. ఎమ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Eesha Rebba: పట్టుచీరలో మహాలక్ష్మిలా దర్శనమిచ్చిన ఈషా రెబ్బా.. ఫోటోలు వైరల్!

ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది

Advertisement

ఫస్ట్ లుక్ ఆవిష్కరణ అనంతరం శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘‘ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ఆడియెన్స్ అంతా కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఇష్టపడుతూ, ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పని చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది.రాజ్ బోను కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ ప్రతిభ ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాను. రాము ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Also Read- మానసికంగా కృంగిపోయాను.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను: హేమ

పోస్ట్ ప్రొడక్షన్‌లో..

Advertisement

ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకుడు శైలేష్ కొలనుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం ఒక నూతన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని, ప్రేక్షకులకు పూర్తి వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. రిషి. ఎం. సంగీతం, వేణు కొత్తకోట సినిమాటోగ్రఫీ, హరీష్ జె.ఆర్ కృష్ణ ఎడిటింగ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్‌కి వస్తున్న స్పందనతో సినిమాపై భారీగా నమ్మకం ఏర్పడిందని యూనిట్ చెబుతోంది.

Also Read- ‘ధురంధర్ 2’ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏం జరిగిందంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×