E-Paper
Advertisement

వాస్తు ప్రకారం ఆలాంటి ఇళ్లలో ఉంటే కోటీశ్వరులైనా దరిద్రులు అయిపోతారట

వాస్తు ప్రకారం ఆలాంటి ఇళ్లలో ఉంటే కోటీశ్వరులైనా దరిద్రులు అయిపోతారట
Advertisement

Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి నిర్మాణం, అందులో ఉండే వస్తువుల అమరిక ఆ ఇంట్లో నివసించే వారి జీవితంపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయట. కొన్ని రకాల ఇళ్లలో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లోపించడం, ఆర్థిక నష్టాలు లేదా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉటుందట. అలాగే కొన్ని ఇళ్లలో అయితే కోట్లు సంపాదించే వారు అయినా దరిద్రులుగా మారిపోతుంటారట. అలాంటి ఇళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈశాన్యంలో బరువు ఉన్న ఇళ్లు: ఇంటి ఈశాన్య మూల (North-East corner) చాలా పవిత్రమైనది. ఆ భాగంలో టాయిలెట్లు ఉండటం, మెట్లు ఉండటం లేదా గోడ కట్టి పూర్తిగా మూసివేయడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందట.

Advertisement

నైరుతి (South-West) లో  డోర్స్: ఇంటి నైరుతి భాగంలో ప్రధాన ద్వారం ఉండటం లేదా ఆ భాగం ఖాళీగా ఉండి, ఈశాన్యం వైపు భారీ బరువులు ఉండటం వల్ల కుటుంబంలో గొడవలు, అస్థిరత ఏర్పడతాయట.

ముళ్ళ మొక్కలు లేదా ఎండిపోయిన చెట్లు: ఇంటి ఆవరణలో ఎండిపోయిన చెట్లు, తుమ్మ లేదా ముళ్ళ పొదలు ఉండటం వాస్తు ప్రకారం అశుభమట. ఇవి నెగటివ్ ఎనర్జీని (Negative Energy) పెంచుతాయట.

Advertisement

బెడ్‌ రూంలో అద్దాలు: బెడ్‌రూమ్‌లో అద్దం (Mirror) ఉండటం వల్ల మనం పడుకున్నప్పుడు మన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే, అది భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

మధ్యలో ఖాళీ లేని ఇళ్లు (బ్రహ్మస్థానం): ఇంటి మధ్యలో (బ్రహ్మస్థానం) స్తంభాలు ఉండటం లేదా ఆ స్థలాన్ని వంటగది లేదా టాయిలెట్‌గా మార్చుకోవడం వాస్తు రీత్యా దోషమట.

వీధి శూలలు (Street Focus): ఇంటి ప్రధాన ద్వారం ముందు నేరుగా రోడ్డు వచ్చి ఆగిపోవడం (ముఖ్యంగా నైరుతిలో) చాలా దోష ప్రదంగా పరిగణించబడుతుందట. ఇలాంటి ఇంట్లో కోటీశ్వరుడు వచ్చి ఉన్నా దరిద్రుడిగా మారిపోతాడట. జీవితంలో అభివృద్ది అనేది అక్కడితో ఆగిపోతుందట.

వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉంటే ఏమవుతుంది?: వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో నివసించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయట. ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం లాంటివి జరుగుతుంటాయట. ఇక కుటుంబ సభ్యులకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఆ ఇంట్లో నిద్ర లేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయట. ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపించకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గడం. ఎంత ప్రయత్నించినా పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, కెరీర్‌లో స్థిరత్వం లేకపోవడం లాంటివి జరుగుతుంటాయట.

వాస్తు దోషాలు ఉంటే ఏం చేయాలి?: మీరు ఉంటున్న ఇల్లుకు మీరు వాస్తు మార్పులు చేసుకోలేని పరిస్థితులో ఉంటే ఆ ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలట. అక్కడ నీటి పాత్ర లేదా చిన్న మొక్క పెంచడం మంచిదట. అలాగే ఇంట్లోకి సూర్యరశ్మి మరియు గాలి బాగా వచ్చేలా చూసుకోవాలట. మూలల్లో వస్తువులను కుప్పగా వేయకూడదట. ఇంట్లో లేత రంగులు (Light colors) వాడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. ఇక ఇంటి మూలల్లో ఒక చిన్న గిన్నెలో కల్లుప్పు వేసి ఉంచితే, అది నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉప్పును ప్రతి వారం మారుస్తుండాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మే నెలలో పుట్టారా..? మీకు ప్రేమ విషయంలో అదే జరుగుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×