E-Paper
Advertisement

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!
Advertisement

China outdoor elevator: జీవితానికి చదువు ఎంతో ముఖ్యమొ తెలిసిందే. అందుకే అక్కడి గ్రామస్తులు ఎంత రిస్కయిన సరే.. తమ పిల్లలను స్కూల్‌కు పంపిస్తారు. విద్యార్థులు కూడా వెళ్లలేమని మారం చేయకుండా.. తమ ప్రాణాలకు తెగించి మరీ స్కూల్‌కు వెళ్తున్నారు. నిత్యం నిలువైన.. ఎత్తైన కొండపైకి ఎగబాకుతూ.. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి స్కూల్‌కు చేరుకొనేవారు. మళ్లీ తిరిగి అదే దారిలో ఇంటికి వెళ్లడానికి మరో మూడు గంటలు శ్రమించేవారు. వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం.. వారి కోసం ఏకంగా కొండకే లిఫ్ట్ ఏర్పాటు చేసింది. ఇది ఇండియాలో కాదు. మన పొరుగు దేశమైన చైనాలో చోటుచేసుకుంది.

మూడు వారాలకు ఒకసారే..

చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లో నిఝహే నదిని ఆనుకొని ఉన్న గ్రాండ్ కేనియన్ దిగువున ఉన్న నిఝహే గ్రామంలో పిల్లలు ఇప్పుడు ఎలాంటి సాహసాలు చేకుండానే స్కూల్‌కు వెళ్తున్నారంటే.. ఈ లిఫ్టే కారణం. ఒకప్పుడు గ్యాన్‌జాయ్ గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్‌కు వెళ్లేందుకు నిటారుగా ఉన్న కొండపైకి ఎక్కాల్సి వచ్చేది. సుమారు మూడు గంటలు శ్రమించి స్కూలుకు చేరుకొనేవారు. రోజూ వెళ్లడం కష్టం కాబట్టి.. మూడు వారాలకు ఒకసారి మాత్రమే ఈ సాహసం చేసేవారు.

268 మీటర్ల ఎత్తైన లిఫ్ట్ నిర్మాణం

Advertisement

గ్రామస్తుల మొర ఆలకించిన చైనా ప్రభుత్వం 2022లో విద్యార్థులు ఆ పర్వతం మీదకు సులభంగా ఎక్కేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా 268 మీటర్ల ఎత్తైన ఔట్ డోర్ ఎలివేటర్ (లిఫ్ట్)ను నిర్మించారు. దీన్ని వారు ‘క్వింగ్‌యున్ ల్యాడర్’ అని పిలుస్తారు. కొండ అంచులో ఉండే ఈ లిఫ్ట్.. విద్యార్థులను క్షణాల్లో పైకి చేరుస్తుంది. అయితే, అక్కడితో వారి ప్రయాణం నిలిచిపోదు. పర్వతం మీదకు చేరుకున్న తర్వాత వారు అక్కడి నుంచి కేబుల్ కార్లో మరింత పైకి చేరాల్సి ఉంటుంది.

పర్యటకులతో కిటకిట..

పర్వతానికి లిఫ్ట్ అనే కాన్సెప్ట్.. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే.. పర్యటకుల ఫోకస్.. క్వింగ్‌యున్ ల్యాడర్‌పై పడింది. ఇంకేం ఉంది.. మన ట్రావెల్స్, రీల్స్ బ్యాచ్, యూట్యూబర్స్ ఊరుకుంటారా? అక్కడికి వెళ్లి ఆ లిఫ్ట్‌ గురించి ప్రపంచం మొత్తానికి చాటింపు వేశారు. దీంతో ఆ లిఫ్టులో ప్రయాణించేందుకు డైలీ వందల సంఖ్యలో పర్యటకులు తరలివస్తున్నారు. దీంతో ఆ లిఫ్టు ఎక్కేందుకు ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టారు.

విద్యార్థులకు ఫ్రీ.. కానీ, పెద్ద క్యూ!

Advertisement

క్వింగ్‌యున్ ల్యాడర్ చూసేందుకు వచ్చే పర్యటకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. లిఫ్ట్ సామర్థ్యం పర్యాటకుల డిమాండ్‌కు సరిపోవడం లేదు. దీంతో అక్కడ గంటల తరబడి క్యూలో నిలుచుకోవల్సి వస్తోంది. అయితే, విద్యార్థులకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ, వారిని మాత్రమే ఉచితంగా లిఫ్ట్ ఎక్కనిస్తారు. విద్యార్థులు వెళ్లాకే పర్యటకులు ఆ లిఫ్ట్ వాడాలి. కానీ, పర్యటకుల తాకిడి వల్ల ఈ మధ్య విద్యార్థులు కూడా క్యూలో నిలబడే పరిస్థితి వస్తోంది. అందుకే.. ప్రభుత్వం ‘ఫుయావో ల్యాడర్’ పేరుతో.. దాని కంటే ఎక్కువ ఎత్తు(288 మీటర్లు)లో మరో ఎలివేటర్‌ను నిర్మించారు. మొదటి ఎలివేటర్‌తో పోల్చితే ఇది వేగంగా పైకి వెళ్తుంది. ఇందులో స్థలం కూడా ఎక్కువే ఉంటుంది.

Also Read: అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

ఇండియా నుంచి చేరుకోవడం ఎలా?

ఇండియా నుంచి మీరు కూడా ఫుయావో, క్వింగ్‌యున్ ల్యాడర్లను చూసేందుకు వెళ్లవచ్చు. ఇందుకు మీరు ముందుగా చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ రాజధాని కున్‌మింగ్‌కు విమానంలో చేరుకోవాలి. అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో షవాన్‌వే నగరానికి వెళ్లాలి. అక్కడి నుంచి పులీ టౌన్‌షిప్ మీదుగా నిఝహె గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి నిఝహె గ్రాండ్ కేనియన్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి ఎలివేటర్ వరకు వరకు వెళ్లేందుకు వాహనాలు ఉంటాయి. హైదరాబాద్ లేదా ఢిల్లీ నుంచి విమానంలో చేరుకుని, అక్కడికి చేరడానికి 10 నుంచి 15 గంటలు పట్టవచ్చు. రోడ్డు మార్గంలో సుమారు 3 రోజులు పడుతుంది. కానీ, భారతీయ వాహనాలను చైనాలోకి అనుమతించరు. ఇందుకు చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. పైగా రిస్క్ కూడా.

Tags

Related News

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×