E-Paper
Advertisement

Show Man Film: హీరోగా రామ్ గోపాల్ వర్మ మూవీ… షూటింగ్ కూడా పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

Show Man Film: హీరోగా రామ్ గోపాల్ వర్మ మూవీ… షూటింగ్ కూడా పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Show Man Film: సంచలనాలకు కేంద్ర బిందువుగా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒకరు. దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా పూర్తిగా ట్రాక్ తప్పారని చెప్పాలి. వివాదాస్పద సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఈ సినిమాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకుడిగా కాకుండా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

హీరోగా రామ్ గోపాల్ వర్మ..

నిజ జీవితంలో షో మ్యాన్ అయిన రాంగోపాల్ వర్మ అదే టైటిల్ రోల్ ప్లే చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “షో మ్యాన్”(Show Man) : మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా రామ్ గోపాల్ వర్మ నటించగా విలన్ పాత్రలో ప్రముఖ నటుడు సుమన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా ద్వారా “నూతన్” అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకపై ప్రొడక్షన్ 120 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విలన్ పాత్రలో హీరో సుమన్..

Advertisement

రాంగోపాల్ వర్మ ఇదివరకే నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణతో కలిసి ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 సినిమాలు చేయడంతో మరోసారి ఆయన నిర్మాణంలోనే వర్మ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ గా నటించబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది .ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సుమన్ అనంతరం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ వచ్చారు. ఈయన రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా తర్వాత మరోసారి విలన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సంక్రాంతి బరిలో వర్మ షో మ్యాన్…

Advertisement

ఇక ఈ సినిమా రామ్ గోపాల్ వర్మకు ఎంతో ఇష్టమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నది .ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది.. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్న హాలు చేస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వర్మ సైతం సంక్రాంతి భరిలోనే షో మ్యాన్ సినిమా ద్వారా రాబోతున్నారని తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Also Read: NTR -Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాలో అక్కినేని హీరో..చర్చలు పూర్తి?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×