E-Paper
Advertisement

Rana Daggubati: సినిమాలకు సెట్ అవ్వనంటూ తీసుకున్న రెమ్యునరేషన్లు తిరిగిచ్చేస్తున్న హీరో రానా.. ఇదేం షాకింగ్ నిర్ణయం..!

Rana Daggubati: సినిమాలకు సెట్ అవ్వనంటూ తీసుకున్న రెమ్యునరేషన్లు తిరిగిచ్చేస్తున్న హీరో రానా.. ఇదేం షాకింగ్ నిర్ణయం..!
Advertisement

Rana Daggubati: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా, తన జీవితంలో ఎదురైన కఠినమైన ఆరోగ్య పరిస్థితుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు.. మాట్లాడారు. ఆరోగ్య సమస్యల తర్వాత తన జీవితం, సినీ ప్రయాణం ఎలా మారిందో వివరించారు.

బాహుబలి 2: ది కంక్లూజన్ ఘన విజయం సాధించిన తర్వాత రానాకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొంతకాలం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. అమెరికాలో చికిత్స తీసుకుని, శస్త్రచికిత్సలు చేయించుకున్న తర్వాత మళ్లీ భారతదేశానికి వచ్చి సాధారణ జీవితం ప్రారంభించారు.

Advertisement

ఇటీవల నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ‘చాప్టర్ 2’ అనే పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రానా, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమాలను వదులుకున్నానని చెప్పారు. “ఆ సమయంలో నేను చేయాల్సిన పాత్రలు బలమైన శరీరాకృతి అవసరమైనవి. కానీ ఆరోగ్య సమస్యల తర్వాత నేను అలా కనిపించలేదు. అందుకే ఆ సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాను,” అని రానా వెల్లడించారు.

ఒక దశలో తనను తానే గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చిందని రానా చెప్పారు. తన స్నేహితుడు, నటుడు వరుణ్ తేజ్‌ను చూసినప్పుడు, “అతడే నాకు తెలిసిన పాత రానాలా కనిపించాడు” అని అన్నారు. ఆ సమయంలో తనకు సినిమాల కంటే బతకడమే ముఖ్యమని చెప్పారు.

Advertisement

ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత రానా చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, హోస్ట్‌గా కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, ప్రత్యేక పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఈ అనుభవాలన్నింటి ద్వారా రానా దగ్గుబాటి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. పేరు, అందం, కెరీర్ కంటే జీవితం ఎంతో విలువైనది. ఆరోగ్యమే నిజమైన సంపద అని ఆయన జీవితమే అందరికీ ఒక మంచి పాఠంగా నిలుస్తోంది.

ALSO READ: Tollywood: తెలుగు సినిమాల్లో మారుతున్న ట్రెండ్‌.. స్టార్ హీరోలు ఆ జానర్‌కు దూరం..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×