E-Paper
Advertisement

Miheeka :చిన్ని ప్రాణం రాబోతోంది.. మిహీక పోస్ట్ వైరల్…బుల్లి రానా రాబోతున్నారా?

Miheeka :చిన్ని ప్రాణం రాబోతోంది.. మిహీక పోస్ట్ వైరల్…బుల్లి రానా రాబోతున్నారా?
Advertisement

Miheeka: మిహీక బజాజ్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడు రానా (Rana)భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. వీరిద్దరూ 2020 ఆగస్టు 8వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. కరోనా కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహ వేడుకలు జరిగాయి .ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు పిల్లలు లేకపోవడంతో తరచూ మిహీక ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మిహీక తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్తలను ఆమె ఖండించారు.

సోనమ్ కపూర్ సీమంతపు వేడుకలు..

ఇకపోతే తాజాగా మిహీక (Miheeka)సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నేను ఎంతో ప్రేమించే కుటుంబంలోకి చిన్ని ప్రాణం రాబోతోందంటూ ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు రానా తండ్రి కాబోతున్నారా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మిహీక షేర్ చేసిన ఈ పోస్ట్ విషయానికి వస్తే..మిహీక తాజాగా నటి సోనమ్ కపూర్(Sonam Kapoor) సీమంతపు వేడుకలలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె షేర్ చేశారు.
సోనమ్ కపూర్ ఆనంద్ అహుజా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు అయితే త్వరలోనే ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బేబీ షవర్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.

చిన్ని ప్రాణం రాబోతోంది..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా మిహీక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సోనమ్ కుటుంబంతో చిన్నప్పటినుంచి ఎంతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ వేడుకలలో పాల్గొన్న మిహీక సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈమె షేర్ చేస్తూ.. చిన్నప్పుడు నీ వెంట నేను తిరగాను ఇప్పుడు నీ పిల్లలు కూడా నీ వెంట తిరగడం చూడాలని ఉంది. మీ జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త అధ్యయనయానికి అభినందనలు. నేను ఎంతగానో ప్రేమించే కుటుంబంలోకి మరో చిన్ని ప్రాణం రాబోతోంది అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నటి సోనమ్ తల్లి కాబోతున్న నేపథ్యంలో ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం తెలిసిన రానా అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు కానీ నటి సోనమ్ తల్లి కాబోతున్న విషయం తెలిసి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.

Advertisement

ఇకపోతే రానా దంపతులు కూడా ఇలాంటి శుభవార్తను చెబితే వినాలని ఉంది అంటూ అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ జంట ఇలాంటి శుభవార్తను ఎప్పుడు చెబుతారో తెలియాల్సి ఉంది. ఇక రానా ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.మిహీక కూడా ఇంటీరియర్ డిజైనర్. ఈమె డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను ప్రారంభించి కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు. పలు ఎన్జీవో సంస్థల ద్వారా ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ మంచి మనసును చాటుకుంటూ ఉన్నారు. మీహీకాకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Also Read: Subbaraju: దయచేసి అలా పెళ్లి చేసుకోవద్దు..పెళ్ళి పై  నటుడు సుబ్బరాజు కామెంట్స్!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×