E-Paper
Advertisement

Stock Market Updates: వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవాళ్టి విశేషాలివే

Stock Market Updates: వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవాళ్టి విశేషాలివే
Advertisement

Stock Market Updates: స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలు చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ముదుపర్ల సెంటిమెంట్‌ బలపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208.17 పాయింట్లు అంటే 0.25 శాతం పెరిగి 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్లు(0.26 శాతం పెరిగి) 25,935.15 వద్ద ముగిసింది.

భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల జోరును కొనసాగించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 84,210 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. పాజిటివ్ సెంటిమెంట్ తో రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,482.95 వద్ద సూచీ గరిష్ఠాన్ని తాకింది. చివరికి 208.17 పాయింట్లు లాభపడి.. 84,273.92 వద్ద ముగిసింది.

ఇవాళ్టి హైలెట్స్

  1. నిఫ్టీ 67.85 పాయింట్ల లాభాపడి 25,935.15 వద్ద ముగిసింది. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ తో డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవల బలపడింది. తాజాగా మారకం విలువ 90.57 రూపాయలకు చేరింది.
  2. FII ఇన్‌ఫ్లోలు దేశీయ స్టాక్ మార్కెట్లకు మద్దతు ఇచ్చాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) సోమవారం రూ.2,255 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
  3. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 (+0.44%), నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 (+0.49%) లాభాలు నమోదు చేశాయి.
  4. ఎటెర్నల్ (+6.15%), టాటా స్టీల్ (+2.72%) నిఫ్టీ 50 లాభాలు నమోదు చేశాయి. బజాజ్ ఫైనాన్స్ (-1.52%), శ్రీరామ్ ఫైనాన్స్ (-1.34%) నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చూశాయి.
  5. బీఎస్ఈలో 1,385 స్టాక్ లు తగ్గగా, 2,655 స్టాక్‌లు పెరిగాయి. 107 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలకు చేరాయి.
Advertisement

Also Read: గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వరద.. ఈక్విటీలతో సమానంగా ఇన్వెస్ట్మెంట్స్

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×