Rana Daggubati: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న వారిలో హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఒకరు. లీడర్ సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనప్పటికీ ప్రస్తుతం విభిన్నమైన కథా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల రానా మరొక నటుడు దుల్కర్ సల్మాన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో నటి దీపికా పదుకొనే పని వేళల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. తరచూ ఈ అంశం గురించి ప్రస్తావనకు వస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ఎన్ని గంటలు పని చేయాలనే పరిమితులు పెట్టుకోవడానికి ఇదేమి ఉద్యోగం కాదని తెలిపారు . సినిమా అంటేనే ఒక లైఫ్ స్టైల్ అని, ఇది మనం ఇష్టపడి ఎంచుకున్న జీవితం కాబట్టి అందుకు అనుగుణంగానే మనం పనులు చేసుకోవాలని తెలిపారు. ఒక సినిమా చేయడానికి ఎంత సమయం పట్టినా వాటికి అనుగుణంగానే మన అలవాట్లు మారాలి కానీ ఉద్యోగం లాగా ఇన్ని గంటలు పనిచేస్తాను అంటే ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వదు అంటూ రానా ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ విధంగా రానా పని వేళల గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన కచ్చితంగా దీపికా పదుకొనేను ఉద్దేశించే ఈ కామెంట్ లు చేశారని స్పష్టం అవుతుంది. ఇక దీపిక పదుకొనే ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానంటూ చెప్పిన నేపథ్యంలో ఎన్నో సినిమా అవకాశాలను కూడా ఈమె మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా హీరోయిన్ రెమ్యూనరేషన్ కాకుండా వారి స్టాఫ్ మెయింటెనెన్స్ కూడా చిత్ర నిర్మాతలే భరించాలి అంటూ కండిషన్లు పెడుతున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాలను వదులుకున్న దీపిక..
ఇలా రెమ్యూనరేషన్ కాకుండా స్టాఫ్ ఖర్చులు అంటే ఎంతో భారం అవుతుంది. ఈ క్రమంలోనే దీపికా పదుకొనేను స్పిరిట్ సినిమా నుంచి తప్పించారు .ఈ సినిమా అనంతరం ప్రభాస్ కల్కి 2 సినిమా నుంచి కూడా ఈమెను తప్పించిన సంగతి తెలిసిందే. ఇలా దీపిక చేసిన ఈ వ్యాఖ్యలపై తరచూ ఇండస్ట్రీలో ఈ విషయం ప్రస్తావనకు రావడంతో పలువురు నిర్మాతలు సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా రానా నిర్మాణంలో దుల్కర్ కాంత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: CPI Narayana: అఖండ 2 టికెట్ల రేట్ల పై సీపీఐ నారాయణ ఫైర్.. ఐబొమ్మ రవిని సృష్టిస్తున్నారంటూ!