E-Paper
Advertisement

Hardik Pandya: హైద‌రాబాద్ పోలీసుల‌తో హ‌ర్ధిక్ పాండ్యా గొడ‌వ ?

Hardik Pandya:  హైద‌రాబాద్ పోలీసుల‌తో హ‌ర్ధిక్ పాండ్యా గొడ‌వ ?
Advertisement

Hardik Pandya:  టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్న‌మెంట్‌ లో ( Syed Mushtaq Ali Trophy Elite 2025) భాగంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఓ కీలక మ్యాచ్ ఆడాడు హార్థిక్ పాండ్యా. ఈ సందర్భంగా అత‌ని ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి దూసుకువ‌చ్చారు. హ‌ర్ధిక్ పాండ్యాతో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌య‌త్నించారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌. ఈ త‌రుణంలోనే ఆ ఫ్యాన్స్ ను పోలీసులు వాళ్లను కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సీరియస్ అయిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya), హైదరాబాద్ పోలీసులను ( Hyderabad Police) మందలించారు. ఇలాంటి సంఘటన రెండుసార్లు ఒకేరోజు జరిగింది. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

హైద‌రాబాద్ పోలీసుల‌తో హ‌ర్ధిక్ పాండ్యా గొడ‌వ ?

Advertisement

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్న‌మెంట్‌ లో ( Syed Mushtaq Ali Trophy Elite 2025) భాగంగా నిన్న బరోడా vs పంజాబ్ జ‌ట్ల మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక అయింది. ఈ త‌రుణంలోనే ఈ మ్యాచ్ లో అద్భుంగా ఆడిన బ‌రోడా జ‌ట్టు, విజ‌యం సాధించింది. గాయం నుంచి కోలుకున్న All Rounder హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) విజృంభించాడు. 77 ప‌రుగులు చేయ‌డమే కాకుండా ఓ వికెట్ కూడా ప‌డ‌గొట్టాడు. దీంతో, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ద‌క్కింది.

ఇది ఇలా ఉండ‌గా ఈ మ్యాచ్ జ‌రిగేట‌ప్పుడు రెండు సార్లు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ గ్రౌండ్ లోకి దూసుకువ‌చ్చారు. హార్దిక్ పాండ్యాతో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అక్క‌డే ఉన్న హైద‌రాబాద్ పోలీసులు, పాండ్యా ఫ్యాన్స్ ను ( Pandya Fans) అడ్డుకున్నారు. అక్క‌డి నుంచి త‌రిమేశారు. వాళ్ల‌ను కొట్టే ప్ర‌య‌త్నం కూడా చేశారు. ఇక ఇది చూసిన హ‌ర్ధిక్ పాండ్యా సీరియ‌స్ అయ్యారు. హైద‌రాబాద్ పోలీసుల‌కు వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ల‌ను కొట్ట‌కండి నాయ‌నా అంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో హైద‌రాబాద్ పోలీసులు కాస్త చల్ల‌బ‌డ్డారు. దీంతో ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు వైర‌ల్ గా మారాయి. అయితే, ఫ్యాన్స్ ఇలా రావ‌డం వ‌ల్ల‌, ప్ర‌మాదాలు జ‌రిగే ఛాన్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. సెక్యూరిటీ ( Security) పెంచాల‌ని సూచిస్తున్నారు క్రీడా విశ్లేష‌కులు.

Advertisement

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×