E-Paper
Advertisement

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!
Advertisement

Ranabaali VS AK 47 Movie: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుదల అవుతూ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పండుగ సమయాలలో మాత్రం చిన్న హీరోల నుంచి మొదలుకొని పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే దసరా పండుగను టార్గెట్ చేస్తూ స్టార్ హీరోల సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నెలలో రజనీకాంత్ వెంకటేష్ విజయ్ దేవరకొండ లాంటి హీరోలు పోటీకి సిద్ధమయ్యారు.

ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ..

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడితూ వస్తుంది అయితే ఈ సినిమాని అక్టోబర్ 14 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అక్టోబర్ 15వ తేదీ విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన రణబాలి (Ranabaali)సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు పోటీగా విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47(Aadarsha Kutumbam) సినిమా కూడా అక్టోబర్ 15వ తేదీనే విడుదల కాబోతోందని సమాచారం.

కొండన్నకు పోటీగా వెంకీ మామ..

Advertisement

ఆదర్శ కుటుంబం సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి అయితే మేకర్స్ ఈ సినిమాని అక్టోబర్ 15వ తేదీ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ఇలా అనుకున్న విధంగానే ఆదర్శ కుటుంబం కూడా అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తే కనుక కచ్చితంగా విజయ్ దేవరకొండ సినిమాతో పోటీగా విడుదలవుతుందని చెప్పాలి.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రణబాలి…

ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి ఈ పోటీలో భాగంగా గెలుపు ఎవరి సొంతమవుతుంది అనే విషయం పట్ల అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాబోతున్న రణబాలి సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 19వ శతాబ్దపు బ్రిటీష్ వలస పాలన కాలం నాటి ఒక చీకటి అధ్యాయం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఉన్నాయి.

Advertisement

Also Read: న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

Related News

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

Big Stories

Advertisement
×