E-Paper
Advertisement

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!
Advertisement

Kaushal Manda : బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ మండా (Kaushal Manda) పేరు వినగానే ప్రచండమైన ‘కౌశల్ ఆర్మీ ‘ హంగామా గుర్తుకొస్తుంది. షో ముగిసి ఏళ్లు గడుస్తున్నా, అతనికి ఇండస్ట్రీలో రావలసినంత స్థాయిలో అవకాశాలు రాలేదనే చర్చ నెట్టింట నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాలో కౌశల్ నటించాల్సి ఉండగా, ఇండస్ట్రీ రాజకీయాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యాడనే టాక్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ ఈ అంశంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి.

‘హిట్’ మూవీ మిస్సింగ్ వివాదం:

బిగ్ బాస్ విజయం తర్వాత కౌశల్ హీరోగా మంచి ప్రాజెక్టులు వస్తాయని అంతా భావించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ చిత్రంలో అతనికి అవకాశం దక్కాల్సి ఉందనే ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ సినిమాలో విశ్వక్ సేన్ నటించారు. ఇక నాని ఓనర్ అయిన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కడం, అప్పట్లో నాని-కౌశల్ అభిమానుల మధ్య జరిగిన వివాదాల వల్ల కౌశల్‌ను కావాలనే పక్కన పెట్టారనే రూమర్లు అప్పట్లో గట్టిగా వచ్చాయి.

Advertisement

తాజా ఇంటర్వ్యూలో కౌశల్ ఏమన్నాడంటే? :

ఇదే విషయమై తాజాగా మాట్లాడిన కౌశల్, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికీ తనకు స్పష్టంగా తెలియదని చెప్పాడు. అయితే దర్శకుడు శైలేష్ కోలను తనకు మాట ఇచ్చారని, ఆయన అనుకుంటే ఇప్పటికైనా అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక పరిస్థితులు కుదరకపోవడం వల్లే అది జరగలేదని, ఒకసారి దర్శకుడు నిర్ణయించుకుంటే భవిష్యత్తులో అది సాధ్యపడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అభిమానుల గొడవలు – నాని హోస్టింగ్:

Advertisement

బిగ్ బాస్ 2 సమయంలో కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో చూపించిన దూకుడు అంతా ఇంతా కాదు. హోస్ట్ నానితో పాటు తనీష్, రోల్ రైడా, దీప్తి సునైనా వంటి ఇతర కంటెస్టెంట్లపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇక ఈ ప్రభావం వల్లనే నాని ప్రొడక్షన్ బ్యానర్‌లో కౌశల్‌కు ఛాన్స్ రాలేదని కౌశల్ అభిమానులు నమ్మారు. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు అనేది పూర్తిగా కథలు, వ్యక్తిగత నిర్ణయాలు, సమీకరణాలపైనే ఆధారపడి ఉంటాయి.

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ వివాదాలు:

షో తర్వాత కౌశల్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేకపోయింది. ‘కౌశల్ ఆర్మీ ఫౌండేషన్’ ఆర్థిక పారదర్శకత, అంతర్గత గొడవలపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో దాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఇక సరిగ్గా ‘హిట్’ సినిమా నిర్మాణ సమయంలోనే ఈ రచ్చ జరగడం కూడా అతని సినీ కెరీర్ వేగానికి పెద్ద ప్రతిబంధకంగా మారింది.

ALSO READ: బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

ఇండస్ట్రీలో కౌశల్‌ను నిజంగా తొక్కేశారా లేదా అనే ప్రశ్నకు ఇప్పటికీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే గతం గతః అని భావిస్తూ, తనకు మాట ఇచ్చిన మేకర్స్ భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తారనే నమ్మకంతో కౌశల్ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో అయినా అతనికి తగిన బ్రేక్ వస్తుందో లేదో వేచి చూడాలి.

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×