E-Paper
Advertisement

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

Gangster Action Thriller: ప్రేమలో ఓడిపోయిన ఓ వ్యక్తి… ఆ బాధ నుంచి బయట పడటానికి క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడితే ? అక్కడే ఆగకుండా తనను నాశనం చేసిన వారిపై ఒక్కొక్కరిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే ? మరోవైపు మాఫియా చేతిలో చిక్కుకున్న ఓ యువతిని రక్షించే బాధ్యత కూడా అతడి మీద పడితే ? ప్రేమ, ద్రోహం, పగ… ఈ మూడింటి మధ్య సాగే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌నే ‘డీసీ’ (DC).

కథలోకి వెళ్తే…

దేవదాస్ (లోకేష్ కనగరాజ్) జీవితంలో ఎదురైన ఓ తీవ్రమైన వ్యక్తిగత నష్టం, ప్రేమ వైఫల్యం అతడిని పూర్తిగా మార్చేస్తాయి. ఆ బాధను మర్చిపోవడానికి వ్యసనాలకు బానిసైన అతడు… చివరకు క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. కొద్దికాలంలోనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అయితే ఈ ప్రయాణంలో సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న కొందరి అసలు రూపం అతడికి తెలుస్తుంది. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ వ్యాపారాలతో నడుస్తున్న మాఫియా సామ్రాజ్యంతో దేవదాస్‌కు శత్రుత్వం మొదలవుతుంది.

Advertisement

ఇదే సమయంలో అతడి జీవితంలోకి చంద్ర (వామిఖ గబ్బి) వస్తుంది. మాఫియా ముఠా చేతిలో చిక్కుకుని లైంగిక దోపిడీ, హింసను ఎదుర్కొంటున్న చంద్రను చూసిన దేవదాస్… ఆమెను ఆ నరకం నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. కానీ చంద్రను కాపాడటం అంత సులభమైన పని కాదు. ఆమె వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్ ఎంత పెద్దదో తెలుసుకున్న కొద్దీ దేవదాస్‌ గతం కూడా బయటపడుతుంది. చంద్రకు విముక్తి కల్పించడంతో పాటు తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని దేవదాస్ నిర్ణయించుకుంటాడు.

దీంతో కథ సాధారణ రివెంజ్ డ్రామా నుంచి రక్తపాతం నిండిన గ్యాంగ్‌స్టర్ వార్‌ గా మారుతుంది. ఒక్కో అడుగు ముందుకేస్తున్న కొద్దీ శత్రువులు పెరుగుతారు. దేవదాస్‌ ను ఆపేందుకు మాఫియా ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు దేవదాస్‌ లోని కోపం, బాధ, వ్యసనం అతడినే ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. చివరకు తన పగ తీరుతుందా ? చంద్రకు నిజంగా స్వేచ్ఛ దక్కుతుందా ? మాఫియా సామ్రాజ్యాన్ని దేవదాస్ ఎలా కూల్చేశాడు ? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా క్లైమాక్స్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘డీసీ’ (DC)లో లోకేష్ కనగరాజ్, వామిఖ గబ్బి, సంజన కృష్ణమూర్తి, తలైవాసల్ విజయ్, కాస్తూరి రాజా తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ రివెంజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 4 నుంచి ‘సన్ నెక్స్ట్’ (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. గ్యాంగ్‌స్టర్ కథలు, రివెంజ్ డ్రామాలు, యాక్షన్ ఇష్టపడేవారికి, థియేటర్లలో మిస్ అయిన వాళ్ళకు ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇంట్లోనే చూసే ఛాన్స్ వచ్చేసింది.

Read Also: కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

Related News

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

Big Stories

Advertisement
×