E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?
Advertisement

AI Data Centers: ప్రపంచవ్యాప్తంగా ఏఐ జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అన్ని రంగాల్లోనూ ఇదే ఇప్పుడు ట్రెండ్. కానీ, ఈ టెక్నాలజీ వల్ల మన పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏఐ అనగానే మనకు కేవలం కరెంట్ ఖర్చు, నీటి వినియోగం, కార్బన్ ఉద్గారాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, వీటితో పాటు మరో పెద్ద సమస్య చుట్టుముడుతోంది. అదే ‘హీట్ ఐలాండ్’ అనర్థం.

ఎలా డిజైన్ చేయాలి?

లక్షల కొద్దీ సర్వర్లతో నడిచే ఏఐ డేటా సెంటర్లు విపరీతమైన వేడిని బయటికి వదులుతాయి. దీనివల్ల ఆ డేటా సెంటర్లు ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆ ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ భారీ సర్వర్లను చల్లబరచడానికి టెక్ కంపెనీలు రోజుకు లక్షలాది గ్యాలన్ల నీటిని వాడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉండే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లను ఎలా డిజైన్ చేయాలి? ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.

అతిపెద్ద సవాల్..

Advertisement

కేవలం టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూపోతే సరిపోదు.. దానికి తగ్గట్టుగా సస్టైనబిలిటీని కూడా పాటించాలి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా డేటా సెంటర్ల నిర్మాణం ఉండేలా ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్. రాబోయే రోజుల్లో ఏఐ ఫ్యూచర్ బాగుండాలంటే.. ఈ పర్యావరణ భారాన్ని తగ్గించే పక్కా ప్లానింగ్ ఇప్పుడే మొదలుపెట్టాలి.

Also read: పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

Tags

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×