E-Paper
Advertisement

Durandhar 2 Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘దురంధర్’ కలెక్షన్స్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే..?

Durandhar 2 Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘దురంధర్’ కలెక్షన్స్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే..?
Advertisement

Durandhar 2 Collections : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. గతంలో వచ్చిన దురంధర్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండో రోజు కూడా అదే విధంగా వసూళ్ల సునామీని సృష్టించింది.. రణవీర్ సింగ్ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీతో మరోసారి సరికొత్త రికార్డు ను సృష్టించాడు.. మరి ఇక ఆలస్యం ఎందుకు రెండురోజులకు గాను దురంధర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూల్ అయ్యాయో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం…

‘దురంధర్ 2’ రెండో రోజు కలెక్షన్స్.. 

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా కాసుల వర్షం కురిపిస్తుంది.. ప్రీమియర్ల ద్వారానే సుమారుగా 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తొలి రోజు హిందీ వెర్షన్ 110 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ దాదాపు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికొస్తే.. 331 కోట్లు వసూల్ చేసింది. ఇండియాలో 267 కోట్లు, ఓవర్సీస్ లో 64 కోట్లు వసూల్ చేసింది.. మొత్తంగా కలిపి 350 కోట్ల వరకు వసూలు అయినట్లు అంచనా వేస్తున్నారు.. అయితే ఈ వీకెండ్ రంజాన్ కావడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ వీకెండ్ లోపల 500 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న టాక్ ప్రకారం చూస్తే అంతకుమించి వసూళ్లను రాబట్టొచ్చు అని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు..

Advertisement

Also Read : ముగ్గురికి షాకిచ్చిన సత్యం.. మనోజ్ ఫ్యూజుల్ అవుట్.. రోహిణికి మరో షాక్..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమాల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసుకుంటూ వస్తుంది.. ఉగాది సందర్బంగా రిలీజ్ అయిన ఈ మూవీ రెండు రోజులకు గాను భారీగా కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఇప్పటివరకు 350 కోట్ల వసూళ్లను అందుకుంది. పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇందులో హీరో పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. రణవీర్సింగ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది.. కేవలం రెండు రోజుల్లోనే అన్ని కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఈ వీకెండ్ రంజాన్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అతనికి రెండు వేల కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ పంతులు అంచనా..

Advertisement

 

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×