E-Paper
Advertisement

Tata Price Hike: కొనుగోలుదారులకు టాటా షాక్, ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు!

Tata Price Hike: కొనుగోలుదారులకు టాటా షాక్,  ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు!
Advertisement

Tata Motors Price Hike: దేశీయ దిగ్గజ ఆటో మోబైల్ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.  పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను కారణంగా ఐసీఈ (ICE) ప్యాసింజర్ వాహనాల ధరలను ఏప్రిల్ 1, 2026 నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చితే, ఆయా కార్ల ధరలు 0.5% పెరగనున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమలు

టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై ధరల పెంపును అమలు వివరాలను వెల్లడించింది. కొత్త ధరలు  ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరల పెంపు కేవలం కంపెనీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ పెంపు వర్తించదని ప్రకటించింది. కార్ల ధరలు ధరలు సగటున 0.5% మేర పెరుగుతాయని తెలిపింది. వేరియంట్ల వారీగా మార్పుల వివరాలు వెల్లడించనప్పటికీ, పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను టెంపరరీగా భర్తీ చేయడానికి ఈ పెంపును చేయాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది.

ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన బెంజ్, ఆడి

Advertisement

కార్ల ధరల పెంపునకు సంబంధించి టాటా మోటార్స్ తో పాటు లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి కీలక ప్రకటనలు చేశాయి. టాటా కంటే ముందే, ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ సంస్థలు కూడా పెంచిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపాయి. కమర్షియల్ పరంగా, టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల (CV) శ్రేణి అంతటా 1.5% వరకు ప్రత్యేక పెంపును అమలు చేయనుంది. ఈ పెంపు కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

Read Also:  అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి డిజైర్.. 30 లక్షల సేల్స్ వెనుక సీక్రెట్ ఏంటి?

5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన టాటా సియెర్రా

Advertisement

అటు టాటా కంపెనీ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. భారత్ NCAP క్రాష్ పరీక్షలలో టాటా సియెర్రా 5 స్టార్ భద్రతా రేటింగ్‌ ను సాధించినట్లు తెలిపింది. ఈ SUV పెద్దల రక్షణలో దాదాపు కంప్లీట్ స్కోరును సాధించింది. టాటా కంపెనీ ఇటీవల భారత్ లో పంచ్ EVని విడుదల చేయడంతో తన EV పోర్ట్‌ ఫోలియోను కూడా విస్తరించింది.

Read Also:  6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×