E-Paper
Advertisement

బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ సేవలు బంద్!

బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ సేవలు బంద్!
Advertisement

Mee Seva: స్వేచ్ఛ బ్యూరో: రెండు రోజుల పాటు ‘మీసేవ’ సేవలు బంద్ కానున్నాయి. మెయింటెనెన్స్, డేటాబేస్ మైగ్రేషన్ పనుల కారణంగా రెండు రోజుల పాటు మీసేవ సేవలు అందుబాటులో ఉండవని మీసేవ అధికారులు వెల్లడించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 5 తేదీ ఉదయం 8 గంటలవరకు సేవలు నిలిచిపోనున్నాయన్నారు.

మీసేవ కేంద్రాల్లో..

మీసేవ పోర్టల్ పనితీరును మరింత మెరుగుపరచడానికి, సర్వర్ల సామర్థ్యాన్ని పెంచడానికి డేటాబేస్ మైగ్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనుల వల్ల ఆ కాలంలో ఆన్‌లైన్ సేవలతో పాటు మీసేవ కేంద్రాల్లో జరిగే లావాదేవీలన్నీ నిలిచిపోతాయన్నారు. ఈనెల 5వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత నుంచి సేవలు ఎప్పటిలాగే పునరుద్ధరించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉన్నవారు ఈ గడువును దృష్టిలో ఉంచుకొని ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా

మీసేవ చార్జీలు 50శాతం పెంపు

రాష్ట్ర ప్రభుత్వం మీసేవ సేవల వినియోగదారుల ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ కేంద్రాల ద్వారా అందజేసే అన్ని రకాల సేవలపై వినియోగదారుల ఛార్జీలను ప్రభుత్వం 50% మేర పెంచింది. ఈ పెంచిన ఛార్జీలకు అదనంగా 18% జీఎస్టీ కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేటగిరీ-A సేవల ధర రూ. 35 నుండి రూ. 62 కి, కేటగిరీ-B సేవల ధర రూ. 45 నుండి రూ. 80 కి పెరిగింది. ఇందులో మొదటి 4 పేజీల తర్వాత స్కానింగ్ లేదా ప్రింటింగ్‌కు ప్రతి పేజీకి రూ. 2.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బిల్లు చెల్లింపుల ఛార్జీలు కూడా రూ. 35 నుండి రూ. 53 మధ్య నిర్ణయించబడ్డాయి.

విద్యుత్ బిల్లుల చెల్లింపు ఛార్జీలు..

Advertisement

టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులపై కూడా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రూ.200లోపు బిల్లులకు రూ.4, రూ. 201 నుండి రూ.1000 వరకు రూ.9, రూ.1001 నుండి రూ.2500 వరకు రూ.18, రూ.2500పైబడిన బిల్లులకు రూ.44 యూజర్ ఛార్జీగా నిర్ణయించారు. పెంచిన ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ఫ్రా, డిపార్ట్‌మెంట్, ఎస్సీఏ వాటాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Also Read: మీ ఆధార్‌తో వేరే వాళ్లు సిమ్ వాడుతున్నారా.. అయితే బీ కేర్‌ఫుల్..!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×