E-Paper
Advertisement

Ranveer Singh Deepika: రణవీర్ సింగ్ దీపిక మధ్య విభేదాలు.. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన జంట!

Ranveer Singh Deepika: రణవీర్ సింగ్ దీపిక మధ్య విభేదాలు.. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన జంట!
Advertisement

Ranveer Singh Deepika: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) ప్రస్తుతం ధురంధర్ 2(Dhurandhar) సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని నెలల క్రితం మొదటి భాగం విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకోగా, వెంటనే రెండో భాగాన్ని కూడా విడుదల చేయడంతో ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందంపై ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రణవీర్ దీపిక మధ్య విభేదాలా?

ఇలా దర్శకుడు ఆదిత్య ధర్ నటుడు రణవీర్ సింగ్ గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రణవీర్ సింగ్ భార్య దీపికా పదుకొనే(Deepika Padukone)మాత్రం ఈ సినిమా విజయం పై ఎక్కడ స్పందిస్తూ పోస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలోనే వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రణవీర్ సింగ్ దీపిక మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని అందుకు ఈమె తన భర్త సక్సెస్ పై మౌనం పాటిస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాకుండా వీరిద్దరూ విడాకులు తీసుకొని కూడా విడిపోతున్నారంటూ రూమర్లు వచ్చాయి.

రెస్టారెంట్ స్టాఫ్ తో రణవీర్, దీపికా..

Advertisement

ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోనే ఓ రెస్టారెంట్ కి వెళ్లి సందడి చేశారు ఇలా రెస్టారెంట్లో వీరిద్దరూ అక్కడి స్టాప్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరూ జంటగా సంతోషంగా కనిపించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ వచ్చిన వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారని అభిమానులు భావిస్తున్నారు. ఈమె సోషల్ మీడియా వేదికగా కాకపోయినా వ్యక్తిగతంగా తన భర్త విజయాన్ని అభినందించి ఉంటారు ఆ మాత్రం దానికే ఇలాంటి రూమర్లను సృష్టించాలా అంటూ పలువురు ఈ వార్తలను ఖండిస్తున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న దీపికా

Advertisement

ఇలా ఈ జంట సంతోషంగా కనిపించడంతో వీరి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని స్పష్టమవుతుంది.. ఇక రణవీర్ దీపికా పదుకొనే ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక ఒక అమ్మాయి జన్మించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. దీపిక పదుకొనే అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్పిరిట్, కల్కి 2 లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలలో అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ కు అద్భుతమైన రెస్పాన్స్… అదొక్కటే మైనస్ అయ్యిందా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×