E-Paper
Advertisement

Nirmal Crime: బైక్ కొనివ్వలేదని తండ్రిపై అలిగిన కొడుకు.. చివరికి ఏమైందంటే?

Nirmal Crime: బైక్ కొనివ్వలేదని తండ్రిపై అలిగిన కొడుకు.. చివరికి ఏమైందంటే?
Advertisement

Nirmal Crime: నేటి యువత పట్టుదల ఉండటంలో తప్పులేదు కానీ, ఆ పట్టుదల మొండితనంగా మారి ప్రాణాల మీదకు తీసుకురావడమే ఆందోళన కలిగించే అంశం. ‘అడిగింది దక్కలేదు.. అనుకున్నది జరగలేదు’ అన్న చిన్నపాటి అసంతృప్తి, వారిని నిండు జీవితాన్ని బలి తీసుకునేలా ప్రేరేపిస్తోంది.

తాజాగా నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. తను కోరుకున్న బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు, తన నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన పోతరాజు రాకేష్ అనే యువకుడు గత కొంతకాలంగా తనకు ఒక బైక్ కొనివ్వాలని తన తండ్రిని కోరుతున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల చేతనో తండ్రి ప్రస్తుతానికి బైక్ కొనివ్వలేనని ఖచ్చితంగా చెప్పాడు. తండ్రి మాటతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేష్, క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

తండ్రి నిరాకరించిన తర్వాత.. రాకేష్ తాను పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. కానీ పొలానికి వెళ్లకుండా నేరుగా గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. మనస్తాపం నుంచి కోలుకోలేక, అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

సమాచారం అందుకున్న కడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం, బైక్ కొనివ్వలేదనే కారణంతోనే రాకేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 600 కిలోల గంజాయి సీజ్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×