E-Paper
Advertisement

Jr.NTR -Prashanth Neel: ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాలో మరో స్టార్ క్యామియో.. హీరో కూడా ఫిక్స్?

Jr.NTR -Prashanth Neel: ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాలో మరో స్టార్ క్యామియో.. హీరో కూడా ఫిక్స్?
Advertisement

Jr.NTR -Prashanth Neel: గాడ్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమా తర్వాత ఈయన తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఇటీవల దేవర, వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ..

ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరొక యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ హీరో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని త్వరలోనే షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్. నీల్(Prashanth Neel) సినిమాలో నటించబోతున్న మరొక స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని కోసం ఆయన మరో కాదు అక్కినేని అఖిల్(Akkineni Akhil) అని సమాచారం.. గత కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ నీల్ అఖిల్ తో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసమే వీరి మధ్య చర్చలు జరిగాయని, వెంటనే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమాలో అఖిల్?

Advertisement

అఖిల్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇలా డ్రాగన్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇలా ఎన్టీఆర్ సినిమాలో అఖిల్ నటించడం అఖిల్ కెరియర్ ఎంతో కీలకంగా మారుతుందని చెప్పాలి. అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తి అయింది. అయినప్పటికీ ఈయన మొత్తం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం అఖిల్ కూడా ఎంతో ఆరాట పడుతున్నారు.

ఎన్టీఆర్ సినిమాకు రామ్ చరణ్ టైటిల్..

Advertisement

ఇక ఈయన త్వరలోనే లెనిన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే ఒకటో తేదీ విడుదల కావాల్సి ఉండగా పెద్ది సినిమా కారణంగా వాయిదా పడిందని తెలుస్తోంది. తదుపరి విడుదల తేదీనీ చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనున్నారు. అఖిల్ లెనిన్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు ఎన్టీఆర్ సినిమాల్లో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఈ వార్తల పై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read: Vijay Deverakonda’s Parents: పెళ్లికముందే రష్మికకు కండిషన్లు.. విజయ్ పేరెంట్స్ కండిషన్లు వింటే షాక్ అవ్వాల్సిందే!

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×