E-Paper
Advertisement

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Advertisement

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? అని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు ప్రమాద విషయంపై వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ చేసి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులోని 37 మంది ప్రయాణికుల్లో దాదాపు 15 మంది వరకు టీచర్లు ఉండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. క్షత్తగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశించారు.

Also Read: Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు

Advertisement

రాష్ట్ర ప్రభుత్వ అనైతిక చర్యల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన 317 జీవో ప్రకారం అదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారని, వీరంతా విధినిర్వహణలో భాగంగా రోజుకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించాల్సి వస్తోందన్నారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్ద బస్సు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న వాగులో పడిపోయిందని, ఈ ప్రమాదంలో విధులకు వెళ్తున్న వారిలో దాదాపు 15 మంది టీచర్లు ఉండటం బాధాకరమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొమురయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీవో 190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు చేపట్టాలన్నారు.

Also Read: Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×