BigTV English

Ranya Rao: హీరోయిన్ అరెస్ట్.. ఏడాది పాటు జైలు శిక్ష!

Ranya Rao: హీరోయిన్ అరెస్ట్.. ఏడాది పాటు జైలు శిక్ష!

Ranya Rao:సినిమాల ద్వారా సంపాదించే డబ్బు సరిపోక చాలామంది తప్పుడు దారులను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో తప్పుడు దారిని ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా గోల్డ్ స్మగ్లింగ్ చేసి చిక్కుల్లో పడింది ప్రముఖ హీరోయిన్ రన్యా రావు (Ranya Rao) . ఇక ఈ చిక్కులు ఎంతలా అంటే ఏకంగా కటకటాల వెనుక తోసేసాయని చెప్పవచ్చు.


ఏడాది పాటు హీరోయిన్ కి జైలు శిక్ష..

అసలు విషయంలోకి వెళ్తే .. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో గత కొంతకాలంగా భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటి రన్యా రావు కి కోర్టు ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది .విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెపై నమోదైన కేసులో భాగంగా పూర్తి విచారణ జరిపిన తర్వాత కోర్టు ఈమెకు ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. చేసిన తప్పుకు ఒక హీరోయిన్ ఇప్పుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించబోతోంది అని తెలిసి అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.


అసలేమైందంటే?

ఇకపోతే హీరోయిన్ కి ఏడాది పాటు జైలు శిక్ష కోర్టు విధించడంతో పాత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే రన్యారావ్ మార్చి మూడవ తేదీన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి 14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికిపోయింది. ఇక ఆమెతో పాటు ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు అలాగే జువెల్లర్ సాహిల్ జైన్ ఈ స్మగ్లింగ్ రాకెట్ లో భాగమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఇక 2023 నుండి 2025 వరకు రన్యారావ్ ఏకంగా దుబాయ్ కి 50 సార్లు ప్రయాణించగా. అందులో 20 సార్లు తరుణ్ తో కలిసి ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.

బెయిల్ నిరాకరించిన కోర్ట్.. శిక్ష తప్పదా?

ఇక అందులో భాగంగానే ఆమె ప్రయాణాలపై అనుమానం రాగా.. ఆమెను విచారించారు. కానీ ఆమె సంబంధం లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా.. అక్కడ రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రూ. 2.67 కోట్ల నగదు బయటపడింది. ఇక తర్వాత ఆమె నుంచి మొత్తం రూ.17.29 కోట్ల నగదు అలాగే బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అధికారులు ఈమెను కోర్టులో హాజరు పరచగా.. కోర్టు ఇప్పుడు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు బెయిల్ కూడా మంజూరు చేయకుండా.. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కును కూడా కోర్టు నిరాకరించింది. ఇక దీంతో ఏడాది పాటు రన్యారావ్ జైలు జీవితం అనుభవించక తప్పదు అని చెప్పవచ్చు.

ALSO READ:Trisha Vs Nayanthara: మళ్ళీ ముదిరిన వివాదం.. ఇప్పట్లో తగ్గేలా లేదే?

Related News

Varsha Bollamma: సిగ్గులేకుండా సిచ్యువేషన్ షిప్ లో హీరోయిన్.. ప్యాంట్ వేసుకోవడం కూడా మర్చిపోయింది

Tollywood: బడా చిత్రాలకు దేవుడే అడ్డమా.. ఇదెక్కడి విడ్డూరం!

Mrunal Thakur: మృణాల్ నోటిదూల.. ఈసారి విరాట్ భార్యనే ..?

SSMB 29: మహేష్ బాబు మూవీ సెట్ నుండి సీన్ లీక్ .. గూస్ బంప్స్ గ్యారెంటీ!

Ghaati: ఘాటీ సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Big Stories

×