Trisha Vs Nayanthara:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారిలో త్రిష (Trisha ), నయనతార (Nayanthara) ప్రథమ స్థానంలో ఉంటారు. ఇద్దరు ఎవరికీ వారు తమ నటనతో ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూ బిజీగా మారిపోయారు. అయితే అలాంటి ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి వీరిద్దరి మధ్య మొదటి నుంచి చాలా గ్యాప్ ఉంది. వీరిద్దరి కెరియర్ మొదలయ్యి చాలా కాలం అవుతున్నా.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వీరి మధ్య సఖ్యత కుదరడం లేదు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
అక్కడే మొదలైన వార్..
వీరిద్దరి మధ్య ఇలా సఖ్యత లేకపోవడానికి కారణం 2008లో వచ్చిన ‘కురువి’ సినిమా ప్రధాన కారణమని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో నయనతార చేయాల్సిన క్యారెక్టర్ ను త్రిష చేయడంతోనే ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని అందరూ అంటుంటారు. అలా మొదలైన ఈ వార్ ఇప్పటికీ ఆగడం లేదు. దీనికి తోడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమాను త్రిష వదులుకున్నప్పుడు.. ఆ సినిమాను నయనతార చేసి ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కమలహాసన్(Kamal Haasan) ‘థగ్ లైఫ్’ మూవీ ఆఫర్ ముందుగా నయనతార వద్దకు వెళ్లగా.. ఆమె రిజెక్ట్ చేసిందని.. ఆ తర్వాతే త్రిష లైన్ లోకి వచ్చిందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్క్రిప్ట్ విషయంలోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా..
ఇక దీనికి తోడు స్క్రిప్ట్ విషయంలో చేతులు మారిన సినిమాలు.. ఇప్పుడు రెమ్యూనరేషన్ కారణంగా కూడా చేతులు మారినట్లు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. అడివెల్లి సినిమా రీమేక్ కోసం మేకర్స్ నయనతారను సంప్రదిస్తే.. ఆమె మాత్రం ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందని.. అందుకే ఇప్పుడు నిర్మాతలు నయనతారను పక్కన పెట్టి, త్రిషతో చర్చలు మొదలుపెట్టారని సమాచారం. మరి ఈ సినిమా భవిష్యత్తులో ఎవరితో ముందుకు వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ రెమ్యూనరేషన్ కారణంగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే చర్చలు మొదలవుతున్నాయి. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది కానీ ఇద్దరు హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ నడవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఏం జరిగినా వీరు మాత్రం తమ కెరియర్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతూ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తున్నారు.
also read:Ram Gopal Varma: వాస్తవాన్ని గ్రహించాను.. విమర్శకులపై వర్మ కౌంటర్!