Virat Kohli Autograph: మనదేశంలో క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత క్రికెటర్లను అభిమానులు దేవుళ్ళతో పోలుస్తారు. దేశంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ.. క్రికెట్ కి ఉన్న క్రేజ్ మాత్రం దేనికి లేదు. ఇక క్రీడాభిమానులు తమ అభిమాన క్రికెటర్ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. క్రికెటర్ల పై వారి ప్రేమకు అవధులు ఉండవు. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని ప్రేమించే అభిమానుల సంఖ్య భారీగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
కోహ్లీకి వీరాభిమానులు:
ఫామ్ తో సంబంధం లేకుండా కీలక సమయాలలో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు ఈ ఛేజ్ కింగ్. ఆ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ వెన్నుముకలా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక కోహ్లీ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను అగ్రెసివ్ గా ఉంటాడు. తన దూకుడైన ఆటతీరుతో తోటి ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. అందుకే కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు.
ఇక ఇతడు ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ ఎగబడి సెల్ఫీలు తీసుకుంటారు. సెల్ఫీ అడిగిన వారికి సహనం కోల్పోకుండా ఎంతో ఓపికగా అతడు సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కోహ్లీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులను ఎప్పుడూ నిరుత్సాహానికి గురి చేయడు. అలాంటి విరాట్ కోహ్లీతో ఒక్క సెల్ఫీ కోసమో, ఆటోగ్రాఫ్ కోసమో అభిమానులు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. విరాట్ తో ఒక్క ఫోటో కోసం చాలామంది అభిమానులు మైదానంలోకి ఆట మధ్యలో ప్రవేశించడం మనం చాలా సార్లు చూసాం.
రాత్రికి రాత్రే కోటీశ్వరుడు:
అయితే ఇలా కోహ్లీ ఇచ్చిన ఓ ఆటోగ్రాఫ్ తో 20 ఏళ్ల ఓ కుర్రాడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ కథనం ప్రకారం.. 20 ఏళ్ల ఓ కుర్రాడు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ని ఏకంగా 8 కోట్లకు అమ్ముకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. 2025 జూలై 13న ప్రచురించబడిన ఈ కథనంలో.. 2015 ఐపీఎల్ సందర్భంగా అభిమానుల సమావేశంలో విరాట్ కోహ్లీ తన క్రికెట్ బ్యాట్ పై సంతకం చేసి ఈ 20 ఏళ్ల కుర్రాడికి ఇచ్చాడట.
Also Read: Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!
2015 ఐపీఎల్ సమయంలో ఆ కుర్రాడి వయసు 10 సంవత్సరాలు. అయితే తాజాగా ఆ కుర్రాడికి ఓ సెల్ఫీ కూడా ఇచ్చాడు. అయితే కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉన్న ఆ బ్యాట్ ని ఈ 20 ఏళ్ల కుర్రాడు దుబాయ్ లో ఉన్న ఓ కలెక్టర్ కి ఆన్లైన్ లో వేలం ద్వారా అమ్మకం జరిపాడని సమాచారం. విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్ ఆటోగ్రాఫ్ కి గణనీయమైన విలువ ఉన్నప్పటికీ.. ఈ వాదన నిజమని అంగీకరించడానికి ఎటువంటి సాక్షాలు లేవు. ఉదాహరణకు 2024 ఆగస్టులో జరిగిన చారిటీ వేలంలో విరాట్ కోహ్లీ జెర్సీ 40 లక్షలకు, అలాగే అతడి గ్లోవ్స్ 28 లక్షలకు అమ్ముడు అయ్యాయి. కోహ్లీకి సంబంధించి అమ్ముడైన అత్యంత ఖరీదైన క్రీడా జ్ఞాపకాలు ఇవే. అయితే ఇప్పుడు కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్ ని ఆ కుర్రాడు 8 కోట్లకు అమ్మకం జరిపాడని వైరల్ గా మారిన ఈ వార్తలో వాస్తవం ఎంత..? అనేది తెలియాల్సి ఉంది.