Rashmi Remuneration: చిన్నా చితకా యాంకర్లే ఒక్కో ఈ ఈవెంట్ కి పది,పాతిక అంటూ వేలల్లో వసూలు చేస్తున్న కాలం ఇది.అలాంటిది జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ ప్రోగ్రామ్ కి యాంకర్ గా హోస్ట్ చేసిన రష్మి గౌతమ్ ఒక్కో ఎపిసోడ్ కి ఎంత పారితోషికం వసూలు చేస్తుందో తెలుసా?ఏంటి.. మహా అయితే యాబయ్ నుండి లక్ష వరకు ఉంటుదేమో అని లెక్కలేస్తున్నారా?అయితే మీరు తప్పులో కాలేసినట్టే.ఎందుకంటారా అంతకు మించే ఉంటుందని ఇపుడు ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట.
రష్మి పుచ్చుకుంటున్న పారితోషికం అక్షరాల
అవును..తనదైన స్టెప్పులు, మాటలు, పంచులు అన్నిటికి మించి గ్లామర్ తో జబర్దస్త్ షోని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేసిన రష్మి ఒక్క ఎపిసోడ్ కి పుచ్చుకుంటున్న పారితోషికం అక్షరాల 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకని సమాచారం.అలా అని ఇదొక్కటే కాదండోయ్ ..శ్రీదేవి డ్రామా కంపెనీ, డీ అంటూ అడపా దడపా రోజుకి ఎంత లేదన్న నెలకి ఐదు నుండి ఆరు ఎపిసోడ్స్ షూటింగ్స్ ఉంటూనే ఉంటాయి. అంటే కేవలం ఈ షోల ద్వారానే నెలకి ఎంత లేదన్న 8 నుండి పది లక్షలు ఈ అమ్మడి ఖాతాలో పడటం పక్కా.వీటికి తోడు ఎలాగూ నెలకో ఓపెనింగ్ అనో, ఏదైనా సినిమా అనో,కాదంటే ఈవెంట్ అనో ఉండనే ఉంటాయి.ఇక వీటికి సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ అదనం.అంటే మొత్తానికి నెల తిరిగే సరికి ఒక పన్నెండు నుండి పదిహేను లక్షలు వెనకేస్తుందన్న మాట.
also read :హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!
గుర్తింపు తెచ్చిన సినిమా 2009లో వచ్చిన సుశాంత్ ‘కరెంట్’
ఇక ఇప్పుడంటే బుల్లి తెరపై యాంకర్ గా అదరగొడుతూ ఇక్కడే పాతుకుపోయింది కాని, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే కొన్ని సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు వేసి తన లక్ ని టెస్ట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన అప్పటి సినిమాల క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంటాయి కూడా.అలా సినిమాలు చేసుకుపోతున్న రష్మికి కాస్తంత గుర్తింపు తెచ్చిన పాత్ర ఏదైనా ఉందంటే అది 2009లో వచ్చిన సుశాంత్ ‘కరెంట్’ సినిమాలో చేసిన ఫ్రెండ్ పాత్రతోనే.ఇక ఆ తర్వాత చాలా ఏళ్ళకి 2016లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఇందులో డిజే టిల్లు అంటూ అదరగొడుతున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా కనిపించిన సంగతి తెల్సిందే.
ఈ అమ్మడు ముందు ముందు ఏ సినిమాలలో అలరించనుందో !
ఇక ఆ తర్వాత ‘అంతం’ (2016), ఆది హీరోగా వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ (2017), మరియు నందు హీరోగా నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ (2022) వంటి సినిమాలతో పలకరించింది రష్మి.అక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదనేమో తిరిగి యూ టర్న్ తీసుకుని టీవీలలో బిజీ అయిపోయింది.ఇక ఈ భామకి సినిమాలు, షో లే కాదండోయ్ ..జంతులవంటే కూడా ఎంతో ఇష్టం.ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ని కాపాడటం కోసం, వాటి రక్షణ కోసం ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా గొంతు విప్పుతూనే ఉంటుంది.చూడాలి మరి వరుస ఈవెంట్స్ తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు ఇంకెంత డిమాండ్ చేస్తుందో !
also read :2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?