Rashmika mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. వివాహం తర్వాత వీరిద్దరూ నటించిన రణబాలి చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా కాఫీ విత్ కరణ్ సీజన్ 9 లో పాల్గొన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. ముఖ్యంగా తనను పెళ్లి చేసుకోమని రష్మిక విజయ్ ను అడిగితే.. 100 సార్లు ప్రపోజ్ చేయమని విజయ్ అడిగారట. కానీ రష్మిక మాత్రం ఏడాది పాటు విజయ్ ని పెళ్లి చేసుకోమని అడిగాను అంటూ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. దీంతో విజయ్ దేవరకొండ ను టార్గెట్ గా చేసుకొని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పిస్తున్నారు. దీంతో రష్మిక దీనిపై సుదీర్ఘ పోస్టు పంచుకుంది.
“మమ్మల్ని గాఢంగా ప్రేమించే వారికి , శాశ్వతంగా ద్వేషించే వారందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. సాధారణంగా నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఉంది. కొన్నిసార్లు వాటిని చదివి భిన్నమైన దృక్కోణాన్ని పొందడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది..కానీ మా ఇంటర్వ్యూ పై ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రోల్లింగ్ పై స్పందించే సమయం వచ్చింది. ఇకపోతే ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా కాకుండా.. తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కడానికి ఒక గుంపే వచ్చినట్టు అనిపిస్తోంది.
ఈ క్రమంలో ఎక్కడో అసలు విషయం మరుగున పడిపోయింది. బహుశా అది మీ దృష్టి కోణానికి సరిపోలేదేమో.. మీలో కొందరు మా ప్రేమను చూడడానికి ఇష్టపడడం లేదేమో.. ప్రేమను నమ్మే వారిని నేను కాపాడాలనుకుంటున్నాను.. కాబట్టి ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
నా జీవితం పై.. నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. మా ఇద్దరిలో ఎవరు గొప్పగా ప్రపోజ్ చేస్తారు అని మేము చూడలేదు. ఆ సంభాషణ జీవితంలోని ఎత్తుపల్లాలు, సంతోషాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మేము కోరుకునేది ఇదేనని.. దానికి ఇదే సరైన సమయం అని నిర్ధారించుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మనమిద్దరం సమయం తీసుకోవాలని ఆయన కోరారు. నేను అలాగే చేశాను. మేము ఒకరినొకరు ఎంచుకున్నాము. నాకు ఏం కావాలో కచ్చితంగా తెలుసు అనడంలో తప్పులేదు.. అలాగే జీవితంలోని ఆచరణాత్మక విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడానికి అతనికి సమయం కావాలి . అది కోరడంలో తప్పులేదు కదా..
అయితే మా ప్రేమను ఏ విధంగానూ ఏది మార్చలేదు. నేను మనసుపెట్టి ఆలోచించాను .మా ఇద్దరి జీవితాలలో ఒకరికొకరు జీవితాంతం తోడుండాలని కోరుకున్నాము. మాకు పెళ్లి అంటే ఎప్పుడూ ప్రపోజల్ కాదు.. మోకరిల్లి అడగడం, వేలికి ఉంగరం పెట్టడం కాదు.. అది కేవలం అలంకారప్రాయమైన విషయం మాత్రమే.. మాకు పెళ్లి అంటే కలిసి ఒక జీవితాన్ని, ఒక భవిష్యత్తును నిర్మించుకోవడం.. ఇప్పటివరకు మేము ఆ పనిని చాలా అందంగా చేశాము. మీరు ఎవరికోసమైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిని మీకోసం అలాగే చేసే వ్యక్తిని కనుగొనండి.
also read:ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
ఇక నేను నా ప్రియుడితో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను. అది ఎప్పుడు కూడా తప్పు విషయం కాదు.. మేము చివరి వరకు మళ్లీ మళ్లీ ఒకరినొకరు ఎంచుకుంటూనే ఉంటాము. ప్రేమ ఎలా ఉండాలనే మీ ఊహకు మా ప్రేమ సరిపోకపోతే పర్వాలేదు.. ప్రపంచంలో సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను.. దయచేసి ఇలాంటి ట్రోల్స్ కి చోటు ఇవ్వకండి” అంటూ ఆమె సుదీర్ఘ పోస్టు పంచుకుంది.
🫰🏻🫶🏻♥️ pic.twitter.com/nQ3W0DYf0K
— Rashmika Mandanna (@iamRashmika) October 26, 2026