E-Paper
Advertisement

The Girl Friend : ఓవర్సీస్‌లో రష్మిక గర్ల్‌ఫ్రెండ్ హవా.. మరో రికార్డ్ బ్రేక్..!

The Girl Friend : ఓవర్సీస్‌లో రష్మిక గర్ల్‌ఫ్రెండ్ హవా.. మరో రికార్డ్ బ్రేక్..!
Advertisement

The Girl Friend : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకుంది. నటుడు రాహుల్ రవీంద్రన్ కొంత గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేసిన సినిమా ఇది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా ఆర్ట్స్’ వంటి పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమా కావడంతో ముందు నుంచే అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. మౌత్ టాక్ తో పాటుగా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో వసూల్ అయ్యాయి. ఈ మూవీతో రష్మిక ఖాతాలో మరో హిట్ పడింది.. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది. ఇప్పటివరకు అక్కడ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూడాలి…

ఓవర్సీస్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ కలెక్షన్స్..

రష్మిక అంటే సక్సెస్ సినిమాలకు కేరాఫ్ గా మారింది. ఆమె ఇటీవల నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. సల్మాన్ ఖాన్ సినిమా కాస్త నిరాశపర్చిన సరే థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ హవానే కొనసాగుతుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికాలో $475K+ గ్రాస్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్ సాధించడం రష్మిక కెరీర్‌లో మరో ఘనతగా నిలిచింది.. ఇదే జోరుతో కలెక్షన్ వసూలు చేస్తే రష్మిక ఖాతాలో మరో రికార్డు పడిపోయినట్లే.. ఓవర్సీస్ లో చివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి..

Advertisement

Also Read :ఓర్నీ.. ఇదేం క్రేజ్ మామా.. జబర్దస్త్ లోకి చుప్పాక్ జోడి ఎంట్రీ..

ది గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ వివరాలు..

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. రష్మిక నటన, మ్యూజిక్‌, స్క్రీన్‌ప్లే అన్నీ కలిసి సినిమాకు బలమైన హైలైట్‌లుగా నిలిచాయి. ఈ మూవీని 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు..మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 550 స్క్రీన్‌లలో విడుదల చేశారు.. అతి తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించిన సరే రోజురోజుకీ కలెక్షన్లు పెరగడంతో త్వరలోనే 50 కోట్లు వసూలు చేస్తే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్.. ప్రస్తుతం రష్మిక మందన్న నాలుగు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×