BigTV English
Advertisement

Rashmika: ఇంటిని బాగా మిస్ అవుతున్న రష్మిక.. అతనితో వెకేషన్ బదులు ఇంటికెళ్లొచ్చుగా?

Rashmika: ఇంటిని బాగా మిస్ అవుతున్న రష్మిక.. అతనితో వెకేషన్ బదులు ఇంటికెళ్లొచ్చుగా?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, చావా, కుబేర వంటి సినిమాలు వరుసగా హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో పాటు మైసా(Mysaa) అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


ఏడాదిన్నర అవుతోంది..

ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తన ఇంటిని బాగా మిస్ అవుతున్నానని తెలిపారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు మీ హాలిడేను ఎలా ఎంజాయ్ చేస్తార‌నే ప్ర‌శ్న ర‌ష్మికకు ఎదుర‌వ‌గా ఇంటిని బాగా మిస్ అవుతున్నానని తెలిపారు. తాను సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండడం వల్ల సుమారు ఏడాదిన్నరగా తాను ఇంటికి వెళ్లలేదని తన బాధను మొత్తం బయటపెట్టారు. ఇంటితో(Family)పాటు తన స్నేహితులను(Friends) కూడా మిస్ అవుతున్నానని తెలిపారు.


స్నేహితుడు కూడా పట్టించుకోవడం లేదు..

నా స్నేహితులందరూ ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తే నన్ను పిలుస్తుంటారు కానీ ఈ మధ్యకాలంలో నేను బిజీగా ఉంటానని పిలవడం కూడా మానేసారని రష్మిక తెలిపారు. ఇవన్నీ తలుచుకుంటే ఏడుపొస్తుందని రష్మిక తన బాధంతా బయటపెట్టారు. ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో తన తల్లి తనతో ఒక మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవాలని తెలిపారు. అయితే నేను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నానని రష్మిక తెలిపారు. ఈ విధంగా తన స్నేహితులని కుటుంబాన్ని ఈమె చాలా మిస్ అవుతున్నానంటూ మాట్లాడటంతో నేటిజన్స్ మాత్రం చాలా ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండతో లండన్ వెకేషన్..

సినిమా షూటింగ్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి వెకేషన్ వెళ్లకుండా ఇంటికి వెళ్తే సరిపోయేది కదా రష్మిక అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈమెకు ఏమాత్రం విరామం దొరికిన విజయ్ దేవరకొండతో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి లండన్ వెళ్లారని తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ గురించి ఇన్ డైరెక్ట్ గా ఫోటోలు షేర్ చేస్తున్నారే తప్ప అధికారకంగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో ఎప్పటికప్పుడు డేటింగ్ రూమర్ల ద్వారా ఈ ఇద్దరు వార్తల్లో నిలుస్తున్నారు. కెరియర్ పరంగా విజయ్ దేవరకొండ, రష్మిక వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.

Also Read: మొన్న తరుణ్.. నేడు శ్రీకాంత్ అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మామ?

Related News

Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Lokesh Kanagaraj: లోకేశ్ కథను రిజెక్ట్ చేసిన తలైవా.. ఎల్సీయూలోకి అడుగు పెట్టిన డైరెక్టర్!

Mohan Lal: కేరళ కోర్టులో మోహన్ లాల్ కి ఎదురుదెబ్బ.. లైసెన్స్ రద్దు చేయాలంటూ!

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

Akhanda 2 : ప్రతిసారి అదేనా, వీళ్లు ముగ్గురు మారాల్సిందే

Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!

The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Big Stories

×