BigTV English

Sangareddy Tragedy: ప్రాణం తీసిన ఆట.. మెడకు టవల్‌ బిగుసుకుని.. అక్కడికక్కడే చిన్నారి

Sangareddy Tragedy: ప్రాణం తీసిన ఆట.. మెడకు టవల్‌ బిగుసుకుని.. అక్కడికక్కడే చిన్నారి
Advertisement

Sangareddy Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టవల్ బిగుసుకొని 4వ తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందింది. కరెంటు పోవడంతో ఫ్యాన్ కు టవల్ వేసి చిన్నారి ఆడుకుంటున్నది. అప్పటికే స్విచ్ ఆన్ చేసి ఉండటంతో కరెంట్ తిరిగి రావడంతో ఫ్యాన్ తిరిగింది. అంతే ఆ టవల్ చిన్నారి మెడకు గట్టిగా పట్టేసుకుంది. దాంతో సహస్ర మృతి చెందింది.


ఊపిరాడక చిన్నారి మృతి

చిట్కుల్‌కు చెందిన 9 ఏళ్ల సహస్ర ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటుంది. ఆ సమయంలో ఇంట్లో కరెంట్ లేకపోవడంతో.. సహస్ర ఫ్యాన్‌ను ఆన్ చేసి పెట్టింది కానీ అది తిరగలేదు. దీంతో ఫ్యాన్‌కు టవల్‌ను కట్టి ఆడుకోవడం మొదలుపెట్టింది. అయితే కొన్ని క్షణాల్లోనే కరెంట్ తిరిగి వచ్చింది. ఫ్యాన్ ఆకస్మాత్తుగా తిరగడంతో, ఆ టవల్ సహస్ర మెడ చుట్టూ బిగుసుకుపోయింది. చిన్నారి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.  కొన్ని క్షణాల్లోనే సహస్ర ఊపిరాడక నేలపై కుప్పకూలింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. వెంటనే ఎవరూ స్పందించలేకపోయారు. చివరకు తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్నారి మృతి చెంది విగతజీవిగా పడిఉంది.


తల్లిదండ్రుల ఆవేదన
ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ పనుల నిమిత్తం.. ఇంటి బయటకు వెళ్లినట్లు సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు చిన్నారిని ఆ స్థితిలో చూసిన వెంటనే గుండె ఆగిపోయినంత పనైంది. సహస్రను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

గ్రామంలో విషాదచాయలు
ఈ ఘటన అనంతరం చిట్కుల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఓ చిన్నారి అంత అకస్మాత్తుగా చనిపోవడం అందరిని కలచివేసింది. ఓ చిన్న తప్పిదం.. ఒక్క క్షణం.. ఓ చిన్నారి జీవితాన్ని కాలరాసింది.

Also Read: తెలివి ఉండే నా తల రాత రాశావా? దేవుడికి లెటర్ రాసి.. యువకుడు అలాంటి పని..

చిన్నారి సహస్ర మరణవార్త తెలిసిన వెంటనే స్థానికులు.. ఆమె తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. గ్రామ పెద్దలు, సమాజ సేవకులు సంఘీభావం తెలియజేశారు. ఇది పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేసే ఘటనగా నిలిచిపోయింది. ఫ్యాన్, విద్యుత్ వంటి విషయాల్లో చిన్నారులకు.. ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంత అవసరమో.. ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. పిల్లల భద్రతకు ప్రతి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పసితనంలోనే ప్రాణాలు కోల్పోయిన సహస్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.

Related News

Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరం ప్రమాదం.. కావేరీ ట్రావెల్ బస్సు దగ్దం, 20 మందికి పైగా మృతి?

Teenager Death: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే బాంబు తయారీ, భారీ పేలుడులో టీనేజర్ దుర్మరణం!

UP Shocker: కుక్కపై ప్రేమ.. బాలుడికి కరెంట్ షాకిచ్చి, విషం పెట్టేసి చంపేసిన యజమాని!

Hanamkonda: క్లాస్ రూమ్‌లో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన 4వ తరగతి విద్యార్థి.. వైద్యులు చెప్పిన కారణం ఇదే

Fake Currency: విశాఖలో దొంగ నోట్ల కలకలం.. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Big Stories

×