BigTV English

Don Lee – Srikanth: మొన్న తరుణ్.. నేడు శ్రీకాంత్ అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మామ?

Don Lee – Srikanth: మొన్న తరుణ్.. నేడు శ్రీకాంత్ అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మామ?

Don Lee – Srikanth:పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అయి క్షణం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ అభిమానులు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్(Spirit) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఆత్రుత అభిమానులలో ఉంది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


స్పిరిట్ సినిమాలో దక్షిణ కొరియా నటుడు…

ఇకపోతే స్పిరిట్ సినిమాలో స్పిరిట్‌లో దక్షిణ కొరియా సూపర్‌స్టార్ డాన్ లీ(Don Lee) విలన్ పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా ఈయనతో కలిసి టాలీవుడ్ హీరోలు దిగిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఎన్నో ఊహగానాలకు తెర లేపారు. గత కొద్ది రోజుల క్రితం ఒకప్పటి లవర్ బాయ్ టాలీవుడ్ నటుడు తరుణ్(Tarun) డాన్ లీ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఇలా మొన్న తరుణ్ నేడు మరొక టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్(Sreekanth) కూడా డాన్ లీతో కలిసి ఫోటోలు దిగారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు వరుసగా ఈయనతో ఫోటోలు దిగడంతో ఈ ఇద్దరు హీరోలు కూడా స్పిరిట్ సినిమాలో భాగమవుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.


భారీగా ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి…

ఇప్పటివరకు ఈ విషయం పట్ల స్పిరిట్ చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సెప్టెంబర్ లో షూటింగ్ పనుల ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని ఇటీవల సందీప్ రెడ్డి సోదరుడు తెలియజేశారు. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను కూడా తెలియ చేయబోతున్నారని సమాచారం. ఇక ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని ఒక పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతున్నారని తెలియజేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ద్వారా తరుణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త కూడా వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ లవర్ బాయ్గా గుర్తింపు పొందిన తరుణ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. దీంతో ఈయన రీఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమా ద్వారా తరుణ్ రీ ఎంట్రీ ఉండబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ వార్తలపై తరుణ్ కూడా ఎక్కడ స్పందించలేదు.

Also Read: ఓటీటీ విడుదలకు సిద్ధమైన 8 వసంతాలు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×