E-Paper
Advertisement

బాబోయ్.. ఈ రేంజ్ రక్తపాతమా? రవిబాబు‘రేజర్’ ట్రైలర్ చూస్తే మతిపోవాల్సిందే!

బాబోయ్.. ఈ రేంజ్ రక్తపాతమా?  రవిబాబు‘రేజర్’ ట్రైలర్ చూస్తే మతిపోవాల్సిందే!

Razor Movie:రవిబాబు.. నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టి దర్శకుడిగానూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు రూట్ మార్చాడు.చివరగా తీసిన ‘క్రష్’,‘ఆవిరి’ లాంటి సినిమాలు థియేటర్ల వైపు చూడకుండా డైరెక్ట్ డిజిటల్‌లోకి వచ్చి ఓకే అన్న ట్యాగ్ వేసుకోగా, ఈసారి ‘రేజర్’అనే యాక్షన్ సినిమా వైపు టర్న్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో అతనే మెయిన్ లీడ్ చేయడం విశేషం.

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగానే ప్లాన్

ఇక తాజాగా విడుదలైన ‘రేజర్’ ట్రైలర్ చూస్తుంటే రవిబాబు ఈసారి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే తనదైన మార్క్ కలర్ టోన్‌తో ఆడియన్స్‌ను ఒక డార్క్ వరల్డ్‌లోకి తీసుకెళ్లాడు. ఇందులో ఒక చిన్న పాపను కాపాడాల్సిన బాధ్యత హీరోపై ఉంటుంది. ఆ పాప ప్రాణాలు తీయడానికి వెతుకుతున్న రౌడీలను హీరో ఒంటిచేత్తో ఎలా వేటాడాడు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

మామూలుగా ఇప్పటివరకు రవిబాబు సినిమాల్లో మనకు సైకలాజికల్ థ్రిల్ లేదా హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించేవి. కానీ ‘రేజర్’ లో మాత్రం ప్యూర్ మాస్ అండ్ యాక్షన్‌ను నమ్ముకున్నాడని తెలిసిపోతుంది. ట్రైలర్‌లో రక్తపాతాన్ని ఏమాత్రం తగ్గించకుండా చూపించడం చూస్తే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగానే ప్లాన్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

also read యశ్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదా? బాంబు పేల్చిన రాకింగ్ స్టార్!

కథ పరంగా చూస్తే

గతంలో ‘అవును’, ‘అవును 2’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రవిబాబు, ఆ తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్‌తో ప్రయోగాలు చేశాడు. కానీ ఈసారి మాత్రం కమర్షియల్ యాక్షన్ ఫార్ములాను టచ్ చేసినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక చిన్నారిని కాపాడే హీరో అనే పాయింట్ కొంచెం రొటీన్‌గా అనిపించినా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం కొత్తగా ఉండేలా కనిపిస్తోంది.

ముఖ్యంగా రవిబాబు బాడీ లాంగ్వేజ్, ఆ సీరియస్ లుక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. ఇక సినిమా అంతా ఒక ఇంటెన్స్ మూడ్‌లో సాగబోతుందని ట్రైలర్ హింట్ ఇస్తోంది. టెక్నికల్‌గా చూస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.

వచ్చే నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు

ఐదేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న రవిబాబు, ఈ ‘రేజర్’తో ఎలాంటి  హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ అయితే గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి వెండితెరపై ఈ‘రేజర్’ ఎంత షార్ప్‌గా ఉంటుందో వేచి చూడాల్సిందే.మొత్తానికి రవిబాబు మార్క్ మేకింగ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

also read:OTT సంచలనం.. సెన్సార్‌ లేని శృంగార కావ్యం.. ఒక్క సిరీస్‌తోనే దేశం మొత్తం ఫిదా!

Related News

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

Big Stories

×