E-Paper
Advertisement

OTT సంచలనం.. సెన్సార్‌ లేని శృంగార కావ్యం.. ఒక్క సిరీస్‌తోనే దేశం మొత్తం ఫిదా!

OTT సంచలనం.. సెన్సార్‌ లేని శృంగార కావ్యం.. ఒక్క సిరీస్‌తోనే దేశం మొత్తం ఫిదా!
Advertisement

Mastram Series:కరోనా పుణ్యమాని సరికొత్త కంటెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఇక థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో, ఓటీటీల్లో వచ్చే క్రేజీ సినిమాలు, సిరీస్‌లకు అంతకుమించిన వ్యూయర్‌షిప్ ఉంటుందన్నది నిజం. అయితే సినిమాలకు అడ్డుపడే సెన్సార్ ఇక్కడ లేకపోవడంతో మేకర్స్ క్రియేటివిటీతో పాటు బోల్డ్‌నెస్‌కు కూడా బార్డర్స్ చెరిపే పనిలో పడ్డారు. ఇదిగో అదే క్రమంలో ఎంట్రీ ఇచ్చింది  మస్త్రామ్.

ఇండియన్ ఓటీటీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి, అత్యంత వివాదాస్పద మరియు విజయవంతమైన సిరీస్ ఇదే. అయితే కథను కేవలం బోల్డ్ కంటెంట్‌కే పరిమితం చేయకుండా, 1980వ నాటి పరిస్థితులు, మిడిల్ క్లాస్ లైఫ్, ముఖ్యంగా ఒక రైటర్ పడే మానసిక వేదన ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు. 1980వ దశకంలో నార్త్ ఇండియాలో సెన్సేషన్ అయిన ఒక సాధారణ రచయిత రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ సిరీస్ రూపొందింది.

Advertisement

కథ విషయానికి వస్తే

రాజారామ్ అనే యువకుడు ఒక టాలెంటెడ్ రైటర్. తాను రాసిన కథలు పబ్లిష్ అయ్యి మార్కెట్లో మంచి గుర్తింపు వచ్చి పెద్ద రచయిత కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే పబ్లిషర్లు మాత్రం సీరియస్‌గా ఉన్న అతని కథలను పబ్లిష్ చేయడానికి ఇష్టపడరు. దాంతో డిసప్పాయింట్‌లో ఉన్న రాజారామ్‌కు   “నీ కథలు ఎవరూ చదవట్లేదు. ఈ కాలంలో మసాలా ఉన్న కథలకే డిమాండ్ ఎక్కువ”అలాంటివి ట్రై చేయి.”అంటూ ఒక పబ్లిషర్ సలహా ఇస్తాడు

Advertisement

దాంతో వేరే దారి లేక రాజారామ్ తన పేరును  మస్త్రామ్ గా మార్చుకొని శృంగార కథలు రాయడం మొదలుపెడతాడు. అతను రాసే ప్రతి కథలోనూ ఒక కొత్త ఊహ ప్రపంచం ఉంటుంది. ఆ కథలు ఎంతలా పాపులర్ అవుతాయంటే అప్పట్లో ప్రతి బుక్ స్టాల్‌లోనూ మస్త్రామ్ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకవైపు రాజారామ్ నిజాయితీ గల వ్యక్తిత్వం, మరోవైపు అతను రాసే మసాలా కథల వల్ల కలిగే ఇబ్బందుల చుట్టూ ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

also read:ఆలియా ఇంట్లో పెళ్లి బాజాలు.. నిశ్చితార్థం చేసుకున్న అక్క షాహీన్ భట్! వరుడు ఎవరంటే?

నటీనటుల విషయానికి వస్తే

రాజారామ్ / మస్త్రామ్ పాత్రలో నటించిన అన్షుమన్ ఝా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఒక అమాయకపు రచయిత పడే అంతర్మథనాన్ని చాలా బాగా చూపించాడు. ఇక మధు అనే పాత్రలో నటించిన తారా అలిషా బెర్రీ ఈ సిరీస్‌కు మరో హైలెట్. అలాగే భోజ్‌పురి స్టార్ హీరోయిన్ రాణీ ఛటర్జీ ఒక పల్లెటూరి అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది.

విడుదల & రికార్డులు

ఏప్రిల్ 30, 2020న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తొలి సీజన్ కేవలం కొన్ని రోజుల్లోనే భారీ వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ రాజారామ్ రాసే ఒక కొత్త కథ బ్యాక్‌డ్రాప్‌తో మొదలవుతుంది.

సీజన్ 2 పరిస్థితి

తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ వెంటనే సీజన్-2 పనులు మొదలు పెట్టారు. కానీ 2021లో కోవిడ్ పరిస్థితులు, అలాగే ఓటీటీ కంటెంట్‌పై ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమాలు కారణంగా షూటింగ్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.వాస్తవానికి 2023 చివరలో మరో యాప్‌లో పార్ట్-2 పేరుతో కొన్ని ఎపిసోడ్లు విడుదలైనప్పటికీ పూర్తి స్థాయి రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం 2026 నాటికి ఈ సిరీస్ రెండో భాగానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదటి సీజన్ లాగే ఇందులో కూడా 10 ఎపిసోడ్లు ఉండొచ్చని, ఈసారి కథ మరింత రొమాంటిక్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

రెండో సీజన్ ఎప్పుడు వస్తుందో

ముఖ్యంగా మస్త్రామ్ అనే రచయిత జీవితంలోని మరో కోణాన్ని ఇందులో చూపించబోతున్నారట. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్, మరోవైపు ప్రపంచానికి తెలియని మస్త్రామ్ గుర్తింపు మధ్య జరిగే ఘర్షణే పార్ట్-2లో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని తెలుస్తోంది.ఏది ఏమైనా డేట్లు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా మస్త్రామ్ క్రేజ్ మాత్రం తగ్గకపోవడం విశేషం. మరి అంచనాలు పెంచేస్తున్న ఆ రెండో సీజన్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి!

also read:వరుడి వేటలో కమల్ హసన్ ..శ్రుతి హాసన్‌ ఈసారైనా పెళ్లి పీటలెక్కేనా!

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×