E-Paper
Advertisement

రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?

రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?
Advertisement

Nominated Posts: నామినేటెడ్​ పోస్టులపై జిల్లా శ్రేణులు ఆశలు
–వచ్చే నెలలో భర్తీ చేసే అవకాశాలు
–ఆశవాహులు అధిష్టానంతో ఫైరవీలు
–పార్టీ సీనియర్లకు ప్రాధాన్యత లభించేనా..!
–ఎన్నికల్లో పోటీచేసే అవకాశంలేని వాళ్లు పోటాపోటీ
–పార్టీ పదవుల కేటాయింపులో ఆలస్యం

రంగరెడ్డి బ్యూరో, స్వేచ్చ: కాంగ్రెస్​ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రయాత్నం చేస్తుంది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం అనేక మంది నేతలు ఆశపడ్డారు. ఆశించిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేకపోయింది. ఆ నేతలకు నామినేటేడ్​ పదవుల పంపకంతోనైనా న్యాయం చేయాలని కాంగ్రెస్​ అధిష్టానం భావిస్తుంది. నామినటేడ్​ పదవులతో పాటు పార్టీ పదవులను సైతం పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పదవులను దక్కించుకునేందుకు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

పార్టీ పదవులపై జాప్యమేందుకు..?

Advertisement

జిల్లా అధ్యక్షులను అధిష్టానం ఇప్పటికే నియమాకం చేసింది. అయితే రంగారెడ్డి జిల్లా అధ్యక్ష స్ధానంపై క్లారిటీ లేదు. పదవీకాలం ముగిసినప్పటికి వారినే కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నూతన అధ్యక్షులను నియమాకం చేశారు. ఈ జిల్లా అధ్యక్షులకు వికారాబాద్​ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్​లో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలపై దిశ నిర్ధేశం చేశారు. పార్టీ బలోపేతంపై ఎప్పటికప్పుడు కార్యకర్తలతో అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు నూతన కమిటీలను పూర్తి స్థాయిలో వేయాలని కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

పార్టీ పటిష్టత కోసం..

పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా స్ధానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని నేతలకు పార్టీలో అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గ స్ధాయిలో పార్టీ పటిష్టత కోసం పనిచేసిన నేతలు ఎమ్మెల్యే టrకెట్ ఆశించి భంగపడిన వారికి నామినేటేడ్​ పదవుల్లో అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తుంది. కానీ కొన్ని ప్రమాణాల ఆధరంగా నామినేటెడ్​ పదవులు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రంగారెడ్డి, వికారాబాద్​, మేడ్చల్​ జిల్లాలో ఆశవాహులు అధిష్టానం చూట్టు తిరుగుతున్నారు. పార్టీ పదవుల కేటాయింపులో జాప్యంతోనే నామినేటేడ్​ పై పెరుగుతున్న ఆశలు.

Advertisement

Also Read: రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!

పదుల సంఖ్యలోనే ఆశవాహులు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం పదుల సంఖ్యలోనే ఆశవాహులున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్​ జిల్లా పూర్తిగా గ్రేటర్​లో వీలనమైయింది.అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల కూడా గ్రేటర్​లో ఉండటం విశేషం. గ్రేటర్​ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగియడంతో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఆశవాహులు గ్రేటర్​ ఎన్నికల్లో కార్పోరేట్​గా పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేసుకోని ప్రజల్లో తిరుగుతున్నారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వికారాబాద్, రంగారెడ్డి రూరల్ ప్రాంతాల్లోని కొంత మంది ఆశవాహులు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెలలో..

అయితే పోట చేసేందుకు అవకాశం లేని సీనియర్​ నాయకులు, పార్టీ పై నమ్మకంతో పనిచేసే నేతలకు మార్కెట్​ కమిటీ చైర్మన్లు, వివధ దేవాదాయ కమిటీల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలుగా బరిలో ఉండాలని టికెట్​ ఆశించి భంగపడిన నేతలకు రాష్ట్ర స్థాయిలోని కార్పోరేషన్​ చైర్మన్​, డైరెక్టర్ల పదవులు కేటాయించాలని పార్టీ భావిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ నామినేటేడ్​ పదువులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. చేవెళ్ల, షాద్​నగర్​, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్​, శేరిలింగంపల్లి, ఉప్పల్​, మేడ్చల్​, కుత్బుల్లాపూర్​, తాండూర్​, వికారాబాద్​ నియోజకవర్గాల్లో కొంతమంది పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read; అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×