E-Paper
Advertisement

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

యూట్యూబ్ లో  అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?
Advertisement

First movie in YouTube :

సినిమాలు చూడాలా …యూట్యూబ్‌ పెట్టెయ్ …

వెబ్ సిరీస్‌లు  చూడాలా ..యూట్యూబ్ క్లిక్ చెయ్ ..

డాక్యుమెంటరీలు చూడాలా …యూట్యూబ్ నొక్కెయ్ …

ఇదీ ఇప్పుడు మనం యూట్యూబ్ ని వాడుతున్న తీరు.కానీ ఒకప్పుడు ఈ వీడియో ఫ్లాట్ ఫామ్  సెకన్ల నుంచి కొన్ని నిమిషాల నిడివి ఉన్న వీడియో లకే పరిమితం అయ్యేది.గంటల నిడివి ఉన్న సినిమాల్ని అప్ లోడ్ చేయాలంటే ఇంపాజిబుల్.మరి అలాంటి పరిస్థితి ని ఓవర్ కమ్ చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏదని ఎప్పుడైనా ఆలోచించారా ?ఇన్ని సినిమాలకి దారినిచ్చిన ఆ మొదటి సినిమా ఏదని ఎప్పుడైనా ఆరా తీసారా ?…ఏంటీ లేదా ..అయితే ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఆ సినిమా పేరు  ‘ఫోర్ ఐడ్ మాన్ స్టర్స్‘ (Four Eyed Monsters).

Advertisement

యూట్యూబ్ లో విచ్చలవిడిగా సినిమాల ప్రవాహానికి గేట్లు తీసిన సినిమా పేరు  ‘ఫోర్ ఐడ్ మాన్ స్టర్స్‘ (Four Eyed Monsters).2005లో ఆరిన్ క్రంలీ (Arin Crumley) మరియు సుసాన్ బ్యూస్ (Susan Buice) అనే ఇద్దరు దర్శకులు కలిసి  తెరకెక్కించిన అమెరికన్ ఇండిపెండెంట్ సినిమా ఇది.ఇక రొమాంటిక్ డ్రామా జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకత ఏంటో తెలుసా ..?దర్శకత్వం వహించిన ఆరిన్ క్రంలీ  మరియు సుసాన్ బ్యూస్ లే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించారు.

కథ విషయానికి వస్తే..

Advertisement

ఇక సినిమా కథ విషయానికి వస్తే ఒక అమ్మాయి,అబ్బాయిమధ్యఇంటర్నెట్ ద్వారా ఎలా పరిచయం ఏర్పడింది,ఆ పరిచయం కాస్తా ఎలా ప్రేమగా మారింది, చివరికి ఒక్కటయ్యారా లేదా ,ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండేవి,దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎడబాటు ఎంత కష్టంగా  ఉండేదివంటివాళ్ళ రియల్లైఫ్లో జరిగినఇన్సిడెంట్స్ ఒకఎక్స్పరిమెంటల్గా ఈ సినిమా ని తెరకెక్కించారట.

అప్పటికిది చాలా అడ్వాన్స్డ్

అయితే కథాపరంగాబానే ఉన్నప్పటికి ఆకాలంలోఇప్పుడున్నంత సోషల్ మీడియా,టిండర్ వంటి డేటింగ్ యాప్స్, ఆన్‌లైన్ రిలేషన్‌షిప్స్ వంటివి ఆరోజుల్లో లేకపోవడంతో జనాలకి అంతగా ఎక్కకలేదు ఈ సినిమా.ఒకరకంగా చెప్పాలంటే అప్పటికిది చాలా అడ్వాన్స్డ్ సినిమా అన్నమాట.ఇక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ ఎక్స్పరిమెంట్ సినిమాని దర్శకులే తమ సొంత డబ్బులతో నిర్మించడం విశేషం,అయితే థియేటర్ లలో ఆడకపోయినా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింస్తే మంచి అప్లాజ్ దక్కడం కాస్త ఊరట అనే చెప్పాలి .

అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా బకెట్ తన్నేయడం వల్లే ఈ సినిమా మొదటగా యూట్యూబ్ లోకి ఎక్కే అవకాశము దక్కించుకుంది.అవును ..థియేటర్లలోఆడియన్స్ సినిమాని అంతగా ఆదరించకపోవడంతో ఆరిన్, సుసాన్ కాస్త కొత్తగా ఆలోచించారు.ఎలాగైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతేనేం  సినిమా ప్రేక్షకుల దగ్గరకే తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు.

మొదటి సారిగా 2007 జూన్ 8న

అయితే 2005లో మొదలైన యూట్యూబ్‌లో అప్పటికి లెంత్ పై రిస్ట్రిక్షన్స్ ఉండటం మూలానచిన్న చిన్న కామెడీ వీడియోలు,ఇంట్లో చేసిన సరదా వీడియోలు  ,ఫన్నీ వీడియోలు,జంతువుల వీడియోలు ఇలా చాలా చిన్న చిన్న లెంత్ తో అప్ లోడ్ చేసేవారు.ఇక ఇదే క్రమంలో తమ సినిమాకి సంబంధించిన  మేకింగ్ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించడం,వాటికి మంచి రియాక్షన్ రావడంతో,మొదటి సారిగా 2007 జూన్ 8న వాళ్ళ ‘Four Eyed Monsters’ సినిమాని కూడా తొలిసారిగా చిన్న చిన్న క్లిప్స్  గా అప్‌లోడ్ చేసినట్లు హిస్టరీ చెబుతుంది.అలా ఒక పూర్తి ఫీచర్ ఫిల్మ్‌ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి గొప్ప శకానికి నాంది పలకారన్న మాట.

మాములుగా అప్పటి వరకు సినిమా చూడాలి అనుకుంటే అయితే థియేటర్, కాదంటే డీవీడీ లేదా టీవీ అనుకునే ట్రెండ్ ని మార్చేస్తూ ఇక నుండి  యూట్యూబ్ కూడా అని ప్రూవ్ చేసింది ఈ Four Eyed Monsters.ఒకరకంగా ఇప్పుడున్న ఓటీటీలు, డిజిటల్ ప్రీమియర్లు,ఆన్‌లైన్ రిలీజ్ లకి అన్నింటికీ మూలం ఈ సినిమానే అని చెప్పకతప్పదు.

దారిని చూపించిన సినిమా

ఇక ఈ సినిమా తర్వాతే  వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లు యూట్యూబ్‌ను ఒక బెస్ట్ అప్షన్ గా చూడటం మొదలెట్టారు.ఏది ఏమైనా  2007లో అలాంటి ఆలోచన చేయడమే చాలా గ్రేట్ అని అనే చెప్పాలి.బిజినెస్ పరంగా Four Eyed Monsters డిజాస్టర్ అయినా ఆ తర్వాత ఎన్నో సినిమాలకి కాసుల వర్షం కురవడానికి కారణం అయింది.మొత్తానికి కోట్ల మంది యూట్యూబ్‌లో సినిమాలు చూస్తుంటే ఆ దారిని చూపించిన సినిమాగా Four Eyed Monsters పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×