E-Paper
Advertisement

Ravi Teja: ఆ మాట అనగానే.. చైల్డ్ ఆర్టిస్ట్‌ను తలపై కొట్టిన రవితేజ, అసలు ఏమైంది?

Ravi Teja: ఆ మాట అనగానే.. చైల్డ్ ఆర్టిస్ట్‌ను తలపై కొట్టిన రవితేజ, అసలు ఏమైంది?
Advertisement

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala)దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi )అనే సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది.

తలపై కొట్టిన రవితేజ..

ఈ సినిమా ట్రైలర్ ను ఏషియన్ రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం వేదిక చిత్ర బృందం సినిమా గురించి పెద్ద ఎత్తున అంచనాలు పెంచుతూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇటీవల వరుస సినిమాలో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్న రోషన్ (Roshan)కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోషన్ మాట్లాడడంతో ఒక్క సారిగా రవితేజ వెనుక నుంచి తలపై లాగిపెట్టి కొట్టారు.. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

విక్రమార్కుడు నుంచి అభిమానిని ..

Advertisement

ఇలా రవితేజ రోషన్ ను కొట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే రోషన్ వేదికపై మాట్లాడుతూ.. రాజులకే రాజు అంటూ గట్టిగా మాట్లాడటంతో సరదాగా రవితేజ వెనుక నుంచి సరదాగా తలపై కొట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రోషన్ మాట్లాడుతూ.. రవితేజ గారు మిమ్మల్ని రవన్న అంటే ప్రాబ్లం లేదు కదా అని మాట్లాడారు . అనంతరం విక్రమార్కుడు సినిమా సమయం నుంచే తాను రవితేజ గారికి పెద్ద అభిమానినని తెలియజేశారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ రోషన్ మాట్లాడారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటేనే ప్రేక్షకులకు కావాల్సిన ఫన్, ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతుందని స్పష్టమవుతుంది. మరి జనవరి 13వ తేదీ చిరంజీవి ,ప్రభాస్ లాంటి హీరోల సినిమాలకు పోటీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఇక అభిమానుల ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన ఉన్నాయి. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా డింపుల్ హైయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు.
Also Read: MSVPG Pre Release: మన శంకర వరప్రసాద్ గారు నుంచి ‘హుక్ స్టెప్స్ ‘ సాంగ్ రిలీజ్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×