E-Paper
Advertisement

Rapido captain Earnings: 4 రోజులు ర్యాపిడో నడిపిన టెక్కీ.. ఎంత సంపాదించాడో తెలుసా?

Rapido captain Earnings: 4 రోజులు ర్యాపిడో నడిపిన టెక్కీ.. ఎంత సంపాదించాడో తెలుసా?
Advertisement

చాలా మంది యువకులు పార్ట్ టైమ్ జాబ్ లో భాగంగా రాపిడో, ఉబర్, ఓలా కెప్టెన్లుగా పని చేస్తున్నారు. ఇతర జాబ్ లు చేసుకుంటూనే, తమకు అనుకూలంగా ఉన్న సమయంలో కొన్ని రైడ్స్ వేస్తున్నారు. మరికొంత మంది అసలు ఉద్యోగం కంటే కెప్టెన్లుగా పని చేస్తూనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ టైంపాస్ కోసం నాలుగు రోజులు పాటు ర్యాపిడో నడిపాడు. ఈ సమయంలో తన సంపాదన గురించి తాజాగా రెడ్డిట్ లో పోస్టు పెట్టాడు. తన సంపాదన, ఖర్చుల గురించి కీలక విషయాలు వెల్లడించాడు. రైడ్ హెయిలింగ్ యాప్‌లో చేరడం వల్ల అత్యవసర పని కావాల్సిన వాళ్లు, పార్ట్ టైమ్ జాబ్ కోసం చూసే వాళ్లకు మంచిదన్నాడు.

పార్ట్ టైమ్ రాపిడో కెప్టెన్ గా..

తాజాగా సదరు టెక్కీ.. రాపిడోలో నాలుగు రోజుల పాటు  పార్ట్ టైమ్ హస్టిల్‌ గా చేరానని చెప్పాడు. ఇందుకోసం తాను సూపర్ స్ప్లెండర్ బైక్‌ను ఉపయోగించినట్లు చెప్పాడు. ఈ బైక్ తనకు 40 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చినట్లు వివరించాడు. రాత్రి 10 గంటల తర్వాత ఎక్కువ రైడ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. ఉదయం 6 గంటల వరకు రైడ్స్ కొనసాగించానన్నాడు. రాత్రి పూట రైడింగ్స్ కు గాను రాపిడో 20% నైట్ ఫేర్ ఇన్సెంటివ్ అందించినట్లు చెప్పాడు.

నాలుగు రోజుల్లో సంపాదన ఎంత అంటే?

Advertisement

నాలుగు రోజుల్లో సదరు టెక్కీ 17 గంటలు పని చేసినట్లు చెప్పాడు. ఈ నాలుగు రోజుల పాటు ఎంత సంపాదించాడో పూర్తి వివరాలు వెల్లడించాడు. తొలి రోజు సాయంత్రం 6:30 నుంచి  రాత్రి 9:00 వరకు రూ. 170, రాత్రి 11:00 నుంచి ఉదయం 1:30 వరకు రూ. 460 సంపాదించాడు. తొలి రోజు 5 గంటలు పని చేసి రూ. 630 పొందాడు. రెండో రోజు  మధ్యాహ్నం 1:00 నుంచి  3:00 గంటల వరకు రూ. 237 సంపాదించాడు.  రాత్రి 8:30 నుంచి అర్థరాత్రి 12:00 వరకు రూ. 520 సంపాదించాడు. 5 గంటల పనికి రూ. రూ. 750 సంపాదించాడు.  మూడో రోజు  రాత్రి 8:30 నుంచి 11:30 వరకు 3 గంటలు పని చేసి రూ. 420 సంపాదించాడు. నాలుగో రోజు రాత్రి 8:30 నుంచి అర్థరాత్రి 12:00 వరకు 4 గంటలు పని చేసి రూ. 420 సంపాదించాడు.

మొత్తంగా టెక్కీ.. నాలుగు రోజుల్లో 200 కి.మీ ప్రయాణించాడు. అతడికి  రూ.400 ప్యూయెల్ ఖర్చు అయ్యింది. అతడికి ఎలాంటి ఓవర్ హెడ్ ఖర్చులు లేవు. ఫ్యూయెల్ ఖర్చు తీసేస్తే 17 గంటల పనికి రూ.1820 సంపాదించాడు. ట్రాఫిక్ తక్కువగా ఉండటం,  ట్రిప్పులు వేగంగా పూర్తవడం వల్ల నైట్ షిఫ్ట్‌ లు తనకు కలిసి వచ్చాయని చెప్పాడు. రాపిడో కమీషన్ ఫీజులను తగ్గించలేదని, బెంగళూరులో నైట్ రైడ్లకు మంచి డిమాండ్ ఉందన్నాడు. అయితే, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు లైసెన్స్, RC, ఇన్సూరెన్స్, పొల్యూషన్ చెక్, సరైన నంబర్ ప్లేట్లు, రైడర్, పిలియన్ ఇద్దరికీ హెల్మెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ఉపాధి కావాలనుకునే వారికి ర్యాపిడో చాలా అనుకూలంగా ఉంటుందన్నాడు.

Advertisement

Read Also: టయోటా అర్బన్ క్రూయిజర్ EV టీజ్ వచ్చేసింది.. రేంజ్ ఎంతో తెలుసా?

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×