E-Paper
Advertisement

Karnataka News: అన్న ఇంటికి నిప్పు పెట్టబోయి.. సజీవ దహనమైన తమ్ముడు

Karnataka News: అన్న ఇంటికి నిప్పు పెట్టబోయి.. సజీవ దహనమైన తమ్ముడు
Advertisement

Karnataka News:  కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా కడవరకు తోడుంటాడని నమ్మిన తమ్ముడే కాలయముడయ్యాడు. ఆపదలో అండగా నిలవాల్సిన రక్తసంబంధం.. ఆస్తి కక్కుర్తి ముందు వెలవెలబోయింది. కలిసి మెలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య ‘ఆస్తి’ చిచ్చు పెట్టింది. సొంత అన్న అని కూడా చూడకుండా.. ఏకంగా అన్న ఇంటికే నిప్పు పెట్టాడు . ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట పట్టణంలో చోటుచేసుకున్న ఆస్తి వివాదం ఒక భయంకర ఘటనకు దారితీసింది. మునిరాజ్ అనే వ్యక్తి తన అన్న భూమిని అమ్మేందుకు నిరాకరించాడనే కోపంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ కోపంలో అతడు అతి ప్రమాదకరమైన నిర్ణయానికి పాల్పడ్డాడు.

Advertisement

తన అన్న ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆ సమయంలో తాను ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంత ప్రమాదవశాత్తూ మంటలు తన శరీరానికే అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాద సమయంలో అతడు అగ్నిలో చిక్కుకుని విలవిలలాడిన భయంకర దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

అగ్నిలో చిక్కుకుని విలవిలలాడుతున్న మునిరాజ్‌ను స్థానికులు గమనించి మంటను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మునిరాజ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

ALSO READ: గంజాయి మత్తులో హోటల్ మేనేజర్లు.. ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×