E-Paper
Advertisement

గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న రవితేజ వారసుడు.. తొలి సినిమా రిలీజ్ డేట్ లాక్!

గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న రవితేజ వారసుడు.. తొలి సినిమా రిలీజ్ డేట్ లాక్!
Advertisement

RaviTeja:ఇటీవల కాలంలో సెలెబ్రిటీల వారసులు ఒక్కొక్కరిగా కొత్త సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు మరొకవైపు రవితేజ వారసుడు కూడా తన తొలి సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానులలో అంచనాలు పెంచేశారు.

మారెమ్మ మూవీ రిలీజ్ డేట్ లాక్..

అసలు విషయంలోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. వాస్తవ సంఘటనల ఆధారంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలు.. దేవతలపై ప్రజలకు ఉండే నమ్మకాల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్ పై మయూర్ రెడ్డి బంగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అలాంటి ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు మారెమ్మ తల్లి దీవెనలతో గణేష్ చతుర్థి వీకెండ్ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నామ్ అంటూ ఒక పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

ఆకట్టుకుంటున్న పోస్టర్లు..

Advertisement

తాజాగా విడుదలైన పోస్టర్ లో మాధవ్ రగ్డ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. రెండు కొండల మధ్య ఆకాశంలో దున్నపోతుతో తీవ్రంగా పోరాడుతున్నట్లు ఒక పోస్టర్ ఉండగా.. మరో పోస్టర్ లో ముఖమంతా రక్తంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు కనిపించారు. ఈ రెండు పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. పైగా ఈ రెండు పోస్టర్లకి..”రక్తం , నమ్మకం, త్యాగాలతో కూడిన ఒక నిర్భయమైన కథ మిమ్మల్ని ఒక గొప్ప భావోద్వేగా ప్రయాణానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది” అంటూ జోడించారు. మొత్తానికైతే షేర్ చేసిన ఫోటోలు.. పంచుకున్న క్యాప్షన్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తుండగా.. వినోద్ కుమార్ , రూపా లక్ష్మి, వికాస్ వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రవితేజ ఇరుముడి విడుదల ఎప్పుడంటే?

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇరుముడి. తొలిసారి ఆయన జానర్ మార్చి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రవితేజ హీరోగా.. ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక బాబాయ్ సినిమా వచ్చిన 20 రోజుల్లోనే అబ్బాయి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి నటుడిగా మాధవ్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

ALSO READ: ఎట్టకేలకు సర్జరీపై స్పందించిన అమితాబ్ బచ్చన్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

Related News

బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజి వైద్యబృందం!

చేతికి కట్టుతో కనిపించిన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్!

ఏంటీ..ఒడిస్సీ కి ఇండియాలో వంద కోట్లా ?

కొత్త ప్రాజెక్టుతో కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే?

“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!

బాలయ్య బాబు హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసింది!

ఎట్టకేలకు సర్జరీపై స్పందించిన అమితాబ్ బచ్చన్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

Big Stories

Advertisement
×