E-Paper
Advertisement

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!
Advertisement

SanDisk CZB Series: శాన్‌డిస్క్ (SanDisk) సైలెంట్‌గా ఒక కొత్త మార్కెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. USB-A పోర్టులు మెల్లగా కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ‘సీజెడ్‌బీ సిరీస్’ (CZB Series) పేరిట సరికొత్త USB-C థంబ్ డ్రైవ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెరికా, చైనా మార్కెట్లలోకి ప్రవేశించిన ఈ థంబ్ డ్రైవ్ లు.. త్వరలోనే భారత్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ‘CZB సిరీస్’ కు సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

6 గ్రాముల బరువు

ఈ కొత్త సీజెడ్‌బీ సిరీస్ డ్రైవ్‌లు.. బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి. కీచైన్ తగిలించుకోవడానికి వీలుగా ఇందులో ఒక బిల్ట్-ఇన్ లూప్‌ను అందించారు. 2 అంగుళాల కంటే తక్కువ పొడవు, 6 గ్రాముల బరువుతో ఉండే ఈ డ్రైవ్‌లను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.

సెకనుకు 250MB వరకు

Advertisement

సాంకేతికంగా ఇవి USB 3.2 Gen 1 స్టాండర్డ్‌పై పనిచేస్తాయి. ఇవి గరిష్టంగా 5Gbps బ్యాండ్‌విడ్త్‌ను సపోర్ట్ చేయడమే కాకుండా సెకనుకు 250MB వరకు సీక్వెన్షియల్ రీడ్ స్పీడ్‌ను అందిస్తాయని శాన్‌డిస్క్ పేర్కొంది. మెుబైల్, ల్యాప్ టాప్ లోని సాధారణ డాక్యుమెంట్లు పంపుకోవడానికి, ఫోటోలు భద్రపరుచుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అయితే నేరుగా డ్రైవ్ నుంచే వీడియో ఎడిటింగ్ లాంటి పనులు చేయాలనుకునే వారికి ఇవి సపోర్ట్ చేయకపోవచ్చు.

ఆ డివైజ్‌లకు సపోర్ట్

ఈ డ్రైవ్‌లు విండోస్ 10, విండోస్ 11, మాకోస్ (macOS) మోంటెరీ, ఆపై వెర్షన్లకు సైతం సమర్థవంతంగా పనిచేస్తాయని శాన్ డిస్క్ తెలిపింది. లైనక్స్, ఆండ్రాయిడ్, పాత వెర్షన్ కంప్యూటర్లలో కూడా వీటిని వాడుకోవచ్చని పేర్కొంది. మరోవైపు ఈ డ్రైవ్ కు సపోర్ట్ చేసే డివైజెస్‌లో ఫైల్ మేనేజ్‌మెంట్, బ్యాకప్ చేసుకోవడానికి ‘శాన్‌డిస్క్ యాప్’ కూడా అందుబాటులో ఉండటం గమనార్హం.

Advertisement

Also Read: 20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

ఇంతకీ ధర ఎంతంటే?

ప్రస్తుతానికి అమెరికా, చైనా మార్కెట్లో ప్రధానంగా ఈ సీజెడ్ బీ సిరీస్ డ్రైవ్‌లు లభిస్తున్నాయి. మెుత్తం మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. 64GB వేరియంట్ 20 డాలర్లు (సుమారు రూ.1,650), 128 జీబీ 25 డాలర్లు (సుమారు రూ.2,080), 256GB 43 డాలర్లకు (సుమారు రూ.3,580) అమ్మకానికి ఉంచారు. ఈ మూడు వేరియంట్లపై కంపెనీ మూడేళ్ల వారంటీని సైతం ఇస్తోంది. త్వరలోనే కెనడా, లాటిన్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించే యోచనలో శాన్‌డిస్క్ ఉంది.

Also Read: పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×