Raviteja:సినిమా ఇండస్ట్రీలో హీరోలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటివారిలో మాస్ మహారాజా రవితేజ(Raviteja ) కూడా ఒకరు. చివరిగా ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన..అప్పటినుంచి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోలేదు అనడంలో సందేహం లేదు. 2024లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే సోలో హీరోగా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు.
గత ఏడాది మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన కనీసం ఈ చిత్రంతోనైనా సక్సెస్ అందుకుంటారు అనుకున్నా కానీ అది కూడా జరగలేదు. దీనికి తోడు ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రవితేజ అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రవితేజ హిట్ అందుకోవడం కష్టమేనా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో చేతులు కలిపినట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రవితేజ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హరీష్ శంకర్ , వక్కంతం వంశీ కాంబినేషన్లో రవితేజ సినిమా చేయబోతున్నారు.. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చల్లో ఉండగా త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో నైనా రవితేజ హిట్ కట్టాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ALSO READ:Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ అదుర్స్!
ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే.. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేశారు. మార్చి 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మార్చి 26న రావాల్సిన ఈ సినిమాను అభిమానుల కోసం వారం ముందుగానే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాకు మించి ఉస్తాద్ భగత్ సింగ్ తో తానేంటో నిరూపిస్తానని చెబుతున్నారు హరీష్ శంకర్. ఈ సినిమా గురించి ఎన్నో అంచనాలు పెంచేశారు. వరుస ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా మారుతూ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంటున్న హరీష్ శంకర్.. ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఫలితం రవితేజతో చేయబోయే నెక్స్ట్ మూవీపై పడుతుంది అనడంలో సందేహం లేదు. మరి హరీష్ శంకర్ అయినా రవితేజ కి మంచి హిట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.