BigTV English
Advertisement

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

RT76 : బాక్సాఫీస్ వద్ద రవితేజ హిట్ సినిమా కూడా చాలా రోజులు అయిపోయింది. ధమాకా సినిమా తర్వాత ఇప్పటివరకు రవితేజ కెరియర్ లో సక్సెస్ లేదు. ఎంతో నమ్మి కొన్ని ప్రాజెక్టులు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ప్రముఖ రచయిత భాను భోగవరపు మాస్ జాతర అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రవితేజకు ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అవుతుంది అని అందరూ ఊహించరు.


కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని వాయిదాలు తర్వాత అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమాకి సరైన పాజిటివ్ టాక్ కూడా రాకపోవడంతో రిజల్ట్ తేడా కొట్టింది. ఇక ప్రస్తుతం రవితేజ తిరుమల కిషోర్ దర్శకత్వంలో తన 76వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఖరారు చేశారు.

గ్లిమ్స్ రెడీ 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడు కిషోర్ తిరుమల కి కూడా మంచి పేరు ఉంది. తాను చేసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రాలహరి సినిమాలు మంచి పేరుని తీసుకొచ్చాయి. శర్వానంద్ హీరోగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. రామ్ పోతినేని హీరోగా చేసిన రెడ్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది.


ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల రవితేజతో చేస్తున్న సినిమా గ్లిమ్స్ కూడా రెడీ అయిపోయింది. రేపు సాయంత్రం 3:33 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు.

ఆకట్టుకున్న అనౌన్స్మెంట్ పోస్టర్ 

ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. రవితేజను వెనకనుంచి చూపించారు. అలానే అనౌన్స్మెంట్ను కవర్ చేస్తున్నట్లు పోస్టర్ ఫోజ్ ఉంది. ఈ సినిమాలో రవితేజ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అని చాలామంది బలంగా నమ్ముతున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఈ అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా విడుదల కానునట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఏ సినిమాలు సంక్రాంతి కానుక విడుదలవుతాయి అనేది తర్వాత తెలుస్తుంది.

Also Read: Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది.

Related News

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

The Raja saab: రాజా సాబ్ ఫస్ట్ సింగల్ పై తమన్ అప్డేట్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయా?

Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!

Big Stories

×