Jana Nayagan : అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. కేవలం కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది. అనిల్ రావిపూడి అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈ సినిమా మిగతా సినిమాలన్నీటి కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి తీశాడా అనే ఫీలింగ్ కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతుంది.
సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని పొలిటికల్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇళయ దళపతి విజయ్. పవన్ కళ్యాణ్ కెరియర్ తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో, అదే మాదిరిగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరిగింది. అయితే విజయ్ సభలకు విపరీతంగా అభిమానులు కూడా వస్తున్నారు. అయితే విజయ్ ఇక సినిమాలకు దూరం అవుతాడు అని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా జననాయగన్.
జననాయగన్ అనే సినిమా మొదలైనప్పుడు నుంచి కొన్ని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి అనే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దాని గురించి చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లోని మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని జననాయగన్ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ లో కొన్ని అంశాలు గమనిస్తే ఇది రీమేక్ అని కొంత మేరకు అర్థమయిపోతుంది.
ఈ సినిమా సాంగ్ నిన్న విడుదలై మంచి ఆదరణ సాధించుకుంటుంది. అయితే ఈ సాంగ్ లో డైరెక్టర్ బై హెచ్ వినోద్ అని క్రెడిట్ లో ఉంది. కేవలం డైరెక్టర్ క్రెడిట్ వేసుకున్నాడు అంటే కథను వినోద్ రాయలేదు. అంటే ఇంకా ఎవరు రాసి ఉంటారు అని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో చాలామంది తెలుగు సినిమా కథనే అక్కడ రీమేక్ చేసి మళ్లీ తెలుగులో రిలీజ్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా మొదలుపెట్టారు. అయితే దీని గురించి ఇప్పటివరకు అధికారక ప్రకటన రాలేదు. గతంలో వీటివి గణేష్ దీని గురించి మాట్లాడే ప్రయత్నాలు చేసినా కూడా అనిల్ రావిపూడి దగ్గరుండి ఆపేశారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు మనం ఏమి చెప్పకూడదు అని స్టేజ్ పైన క్లారిటీ ఇచ్చాడు అనిల్. జననాయగన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Also Read: Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం