Foot Massage: కాలంతో సంబంధం లేకుండా.. అన్ని వేళలా పని చేస్తుంటారు ఆడవాళ్లు. ఇంట్లో పని, ఆఫీసులో పనీ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో మహిళలు చాలా త్వరగా అలసిపోతుంటారు. వీటితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడుతుంటాయి. అలాంటప్పుడు వారి పాదాలకు మసాజ్ చేయడం ఎంతో అవసరం. ఆయుర్వేదంలో కూడా ఫుట్ మసాజ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఫుట్ మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
తరచూ ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల మన శరీరంలో భిన్న అవయవాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే.. అవయవాలను కలిపే నాడులు పాదాలకు అనుసంధానమై ఉంటాయి. అందువల్ల పాదాలకు మసాజ్ చేస్తే అనేక అవయవాలు, కణాలు ఉత్తేజితం చెందుతాయి. దీంతో.. ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదే.. ఫుట్‌మసాజ్ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడొచ్చు. రాత్రిళ్లు పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవాలంటే.. ఫుట్ మసాజ్ చక్కటి పరిష్కారం. మానసిక సమస్యలు ఉన్నవారికి ఈ ఫుట్ మసాజ్ అనేది ఎంతోగానో దోహదం చేస్తుంది.
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఫుట్ మసాజ్ తరచూ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట, బద్దకం దరిచేరవు. ఇక ఫుట్ మసాజ్ వల్ల స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది. నాడులు రిలాక్స్ అవుతాయి. హార్మోన్ల పనితీరు మెరుగు పడుతుంది. దీంతో నెలసరి సమస్యలు కూడా తొలగిపోతాయి. మెనోపాజ్ దశలో ఉండే మహిళలు చిరాకు, ఆందోళనను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు ఫుట్ మసాజ్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
కంటి సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల కళ్లు రిలాక్స్ అవుతాయి. అలాగే మెదడు పనితీరు మెరుగుపడి యాక్టివ్‌గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వృద్ధాప్యంలోనూ అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఫుట్ మసాజ్ వల్ల తలకు అనుసంధానం అయి ఉండే నాడులు సైతం ఉత్తేజితం అవుతాయి. తలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. పాదాలకు, వెన్నెముకను కలిపే నాడులు పాదాల్లో ఉంటాయి. కాబట్టి.. పుట్ మసాజ్ చేస్తే ఆయా నాడులు సైతం యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల వెన్నెముకకు శక్తి లభించి వెన్నెముక మరింత బలంగా మారుతుంది.