Irumudi Film: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో ఇరుముడి(Irumudi) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది .ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా తండ్రీ కూతురు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. రవితేజ తన కూతురిని ఎత్తుకొని తలపై ఇరుముడితో ఉన్నటువంటి ఈ పోస్టర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.
ఇలా ఇరుముడి సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మాలికాపురం అనే సినిమాకు రీమేక్ సినిమాగా రాబోతుందంటూ కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు ఒక హిట్ సెంటిమెంట్ కలిసొస్తుందంటూ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ తో స్టోరీ ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. తండ్రి కూతురి నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కథ మొత్తం కూతురి పాత్రలో నటిస్తున్న చిన్నారి చుట్టే తిరుగుతుందని స్పష్టమవుతుంది. ఇలా గతంలో కూడా డాడీ, హాయ్ నాన్న వంటి ఎన్నో సినిమాలు ఒక చిన్నారి పాత్ర ఆధారంగా తెరకెక్కి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ ఇరుముడి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇలా ఆ హిట్ సినిమాల సెంటిమెంట్ ఇరుముడి విషయంలో వర్కౌట్ అయితే రవితేజకు హిట్ గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు అయితే మరికొన్ని సినిమాలు ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా కూడా నిలిచిన సంగతి తెలిసిందే. మరి రవితేజ ఇరుముడి విషయంలో ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా హిట్ అవ్వడం దర్శకుడు శివ నిర్వాణకు ఎంత అవసరమో.. రవితేజకు అంతకుమించి ఈ సినిమా సక్సెస్ అవ్వటం అవసరమనే చెప్పాలి.
ఈ ఏడాదిలోని ఇరుముడి..
రవితేజ శ్రీ లీల జంటగా నటించిన ధమాకా సినిమా తర్వాత సుమారు అర డజన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఇలా వరుస డిజాస్టర్లు వస్తున్న నేపథ్యంలో రవితేజ కెరియర్ కూడా కాస్త ఇబ్బందుల్లో పడబోతుందని తెలుస్తుంది. ఇరుముడి సినిమా సక్సెస్ రవితేజకు ఎంతో కీలకంగా మారింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: The Raja Saab OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ది రాజా సాబ్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే!