E-Paper
Advertisement

Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌
Advertisement

Iceland Trolls Pakistan:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బంగ్లాదేశ్ తరహాలోని బాయ్ కాట్‌ చేసే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం రోజున టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాల్గొనడంపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ( Pakistan) బాయ్ కాట్ చేస్తే, కొత్త జట్టుకు ఛాన్స్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు సంచలన పోస్ట్ పెట్టింది. బాయ్ కాట్ పై వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( iceland cricket ) నిర్ణయం తీసుకోవాలని కోరింది. మీరు బాయ్ కాట్ చేస్తే టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. మీ నిర్ణయాన్ని ప్రకటిస్తే, మేం వెంటనే కొలంబోకు టికెట్లు బుక్ చేసుకుంటామని కూడా సెటైర్లు పేల్చింది ఐస్ ల్యాండ్‌ క్రికెట్ బోర్డు. అంతేకాదు కొలంబోకు వెళ్లే విమానాల టికెట్లు అయిపోతున్నాయ‌ని కూడా వెల్ల‌డించింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బాయ్ కాట్ చేస్తామని పాకిస్తాన్ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ టోర్నమెంట్ లో ఆడడంపై ఇప్పటి వరకు పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ను దారుణంగా ట్రోలింగ్ చేసింది ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ జట్టు స్థానంలో తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, సంచ‌ల‌న‌ పోస్ట్ పెట్టింది ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డ్. పాకిస్తాన్ స్థానంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామని వెల్లడించింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆడుతుందో ? లేదో? త్వరగా చెబితే మేము సిద్ధమవుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 2వ తేదీన బాయ్ కాట్‌ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటిస్తే మేం వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తామ‌ని పేర్కొంది. ఫిబ్రవరి 7వ తేదీన సరైన సమయానికి కొలంబో చేరుకోవడానికి మాకు కష్టం అవుతుంది… ఏ విషయమైనా తొందరగా చెప్పండి అంటూ ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డ్ ట్రోలింగ్ చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్లు వైర‌ల్ గా మారాయి.

పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే, బంగ్లాదేశ్ కే ఛాన్స్ ?

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇచ్చేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోంద‌ని అంటున్నారు. బంగ్లా అడిగిన‌ట్లు శ్రీలంక‌లో మ్యాచ్ లు ఆడేలా, ఐసీసీ స్కెచ్ వేసింద‌ట‌.

Advertisement

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×