E-Paper
Advertisement

BMW Film: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి  ఫస్ట్ సింగిల్ ..ముహూర్తం ఫిక్స్!

BMW Film: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి  ఫస్ట్ సింగిల్ ..ముహూర్తం ఫిక్స్!
Advertisement

Bhartha mahasayulaku wignyapthi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ(Ravi teja) ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ప్రయాణం ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హిట్టు ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత రవితేజ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి..

రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha mahasayulaku wignyapthi). ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఇక సంక్రాంతి బరిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డిసెంబర్ రెండో వారంలో ఫస్ట్ సింగిల్?

Advertisement

ఈ సినిమాలో గత నాలుగు రోజులుగా అరకులో ఒక పాటను పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే ఈ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్(First Single) ను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెల్లడి కానుంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేయనున్నారు.

సంక్రాంతి బరిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి..

Advertisement

ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), కేతికా శర్మ(Kethika Sharma) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇలా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు కానీ ఎప్పుడు విడుదలవుతుంది అనే సరైన స్పష్టత వెల్లడించలేదు. ధమాకా తర్వాత రవితేజ ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఇక ఇటీవల వచ్చిన మాస్ జాతర కూడా ప్రేక్షకులను నిరాశపర్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి రవితేజకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. రవితేజ కెరియర్ లో ఈ సినిమా తన 76వ సినిమాగా విడుదల కాబోతోంది.

Also Read: Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ క్యామియో…అంచనాలు పెంచిన సందీప్ రెడ్డి!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×